తెలుగు బుల్లితెర చరిత్రలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న ఏకైక కామెడీ షో జబర్ధస్త్. అప్పటికీ ఇప్పటికీ కూడా ఒకే రకమైన రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది.


తద్వారా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సైతం రాబడుతోంది. ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో వచ్చినప్పటికీ అవన్నీ దీని ప్రభావానికి తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. అంతలా ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో జబర్ధస్త్ ప్రసారం అవుతోందట.. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ షో నుంచి యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా వెళ్లిపోయింది. దాంతో రష్మీనే యాంకర్‌గా కొనసాగుతుంది. జబర్థస్త్ ద్వారా కమెడియన్స్ నే కాదు ..


ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ కూడా వెలుగులోకి వచ్చారు మరి.. ఇంకా వస్తున్నారు కూడా. అలాగే యాంకర్లకి కూడా ఈ జబర్ధస్త్ లైఫ్ ని ఇచ్చింది. రష్మి, అనసూయా లాంటి వాళ్ల కెరీర్ ను మలుపు తిప్పింది. అయితే, జబర్ధస్త్ లోకి యాంకర్ గా ఆఫర్ వచ్చిన మూడు సార్లు రిజెక్ట్ చేసింది ఓ యాంకరమ్మ. ఆమె మరెవరో కాదు. లౌడ్ స్పీకర్ అయిన శ్రీముఖి. అనసూయ వెళ్ళిపోవటంతో షో నిర్వాహకులు మరో యాంకర్ శ్రీముఖిని సంప్రదించినట్లు వార్తలు వినిపించగా ఆమె ఈ షో ఒప్పుకోలేదు అని తెలిసింది. దాంతో రష్మినే యాంకర్ గా సెటిల్ అయిపోయిందట.


మంచి క్రేజీ లో ఉన్న జబర్దస్త్ షోకు శ్రీముఖి యాంకర్ గా ఎందుకు ఒప్పుకోలేదని అనుమానాలు రాగా, అందుకు కారణం ఆమె డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇవ్వలేదనే కారణం అని తెలుస్తుంది. ఏదేమైన శ్రీముఖి జబర్ధస్త్ షో చేసి ఉంటే ఆ సందడి వేరేలా ఉండేదని పలువురు అయితే అభిప్రాయ పడుతున్నారు. జబర్ధస్త్ ద్వారా ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు కూడా మరింతగా హైలైట్ అయ్యారు. ఇక, ఇందులో యాంకర్లుగా చేస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌ కెరీర్‌ ఎదుగుదలకు కూడా జబర్ధస్త్ షో ఓ రేంజ్‌లో బూస్టును ఇచ్చిందనే చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: