- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో ఈ వారం విడుదలవుతున్న సినిమాలలో ఎనిమిది వసంతాలు ఒకటి. కుబేరతో పోలిస్తే చిన్న సినిమా అయినా ఇది మైత్రి నుంచి వస్తున్న సినిమా. ఇటీవల పెద్ద నిర్మాణ సంస్థలలో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు ఊహించ‌ని రీతిలో లాభాలు అందుకుంటున్నాయి. టిల్లు - కోర్ట్ - మత్తు వదలరా లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు. అందుకే మైత్రి - సితారా లాంటి సంస్థలు మీడియం చిన్న సినిమాలపై బాగా ఫోకస్ చేశాయి. మైత్రి కూడా అదే బాటలో ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాకు నాలుగు కోట్ల బడ్జెట్ అవుతుందని అనుకున్న 12 కోట్లు అయింది... క్వాలిటీ కూడా బాగా వచ్చింది. నాన్ థియేట్రిక‌ల్ రూపంలో దాదాపు తొమ్మిది కోట్లు వెనక్కి వచ్చేసాయి. మైత్రి మూవీస్ లో ఉన్న బ్రాండ్ ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అయింది.


మరో మూడు కోట్లు రాబట్టుకోవటం పెద్ద విషయం కాదు.. సినిమా హిట్ అయితే లాభాలు భారీగా వస్తాయి. థియేట్రికల్ నుంచి ఎంత మొత్తం వస్తుంది అనే దానిని బట్టి మైత్రి వాళ్లకు అంత ఎక్కువ లాభాలు వస్తాయి. ఒకవేళ కోర్టు సినిమాలా హిట్ అయితే మైత్రి వాళ్ళు బిగ్ జాక్పాట్ కొట్టేసినట్టే ..! టీజర్ - ట్రైలర్ - పాటలు ఫీల్ గుడ్ ఎమోషన్ కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో పూర్తిస్థాయి ప్రేమ కథ చూసి చాలా కాలం అయింది. ఆ లోటు ఈ సినిమా తీరుస్తుందని మైత్రి వాళ్ళు చెబుతున్నారు. అదే జరిగితే యూత్ మళ్ళీ థియేటర్లకు వచ్చి రచ్చ చేసే ఛాన్స్ ఉంది. హీరోయిన్ ఆనంతిక పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దర్శకుడు పణీంద్ర మాటలు ఈ సినిమా సూపర్ హిట్ పై నమ్మకం కలిగిస్తున్నాయి. ఒకరోజు ముందే ప్రీమియర్లు వేసే ఆలోచనలో ఉన్నారు. ప్రీమియ‌ర్లు బాగుంటే ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు రావటం గ్యారంటీ.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: