
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్‌పై ఇంకా సైలెన్స్ కొనసాగుతూనే వస్తోంది. అసలు ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం లో మేకర్స్ నుంచి ఇంక్లా క్లారిటీ అయితే రాలేదు. సినీ సర్కిల్స్ లో ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఓ వార్త చక్కెర్లు కొడుతోంది. హరిహర వీరమల్లు సినిమాను జూలై 24 న రిలీజ్ చేసి తీరుతారనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినీ సర్కిల్స్ లో మాత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ వార్త చక్కెర్లు కొడుతోంది.
హరిహర వీరమల్లు సినిమా ను జూలై 24న ఏదేమైనా రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే వీరమల్లు సినిమాను పలుమార్లు వాయిదాలు వేయడంతో ఈ సారి ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గకుండా ఉండేలా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్లాన్ చేస్తారంటున్నారు. ఇక జూలై 24న మెగా ఫ్యామిలీ హిట్ సినిమాలకు సెంటిమెంట్ రిలీజ్ డేట్ కావడంతో అదే తేదీన వీరమల్లు సినిమాను కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ తేదీన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ - చిరు ఇంద్ర సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు