ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో చాలా సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ ల జోరు విపరీతంగా పెరిగిపోతుంది. ఇకపోతే కేవలం ఈ నెల 28 వ తేదీ నుండి వచ్చే నెల 19 వ తేదీ వరకు 21 రోజుల్లో ఏకంగా 6 సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. మరి ఆ ఆరు సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన రీ రిలీజ్ కానున్నాయి వాటి వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

ఈ నెల 28 వ తేదీన చాలా కాలం క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన హనుమాన్ జంక్షన్ మూవీ రీ రిలీజ్ కానుంది. వచ్చే నెల జూలై 10 వ తేదీన కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకున్న కుమారి 21 F సినిమా రీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత జూలై 11 వ తేదీన రవితేజ హీరోగా రూపొంది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న మిరపకాయ్ మూవీ రీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత సూర్య హీరోగా రూపొందిన గజినీ సినిమా జులై 18 తేదీన రీ రిలీజ్ కానుంది. నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందిన ఏం మాయ చేసావే సినిమా మరియు సూర్య హీరోగా తమన్నా హీరోయిన్గా రూపొందిన వీడొక్కడే మూవీ లు జులై 19 వ తేదీన రీ రిలీజ్ కానున్నాయి. ఇలా జూన్ 28 వ తేదీ నుండి జూలై 19 వ తేదీ వరకు ఏకంగా 6 సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ఈ ఆరు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: