కాంతార.. ఈ సినిమా ఓ సెన్సేషన్..20 కోట్ల బడ్జెట్ తో కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా ఆ తర్వాత పలు భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్ మూవీ గా పేరు తెచ్చుకుంది.అయితే అలాంటి ఈ సినిమా కి ప్రీక్వెల్ గా కాంతార:చాప్టర్ 1 రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా కాంతార: చాప్టర్ 1 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అయితే కాంతార: చాప్టర్ 1 సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో సినిమాకి వర్క్ చేసిన వాళ్లు కొంతమంది చనిపోవడంతో పాటు సినిమాకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. సినిమా షూటింగ్ సెట్లో ఎన్నో ప్రమాదాలు జరగడంతో పాటు ఆటంకాలు కూడా ఎదురయ్యాయి.

ఇక వాటన్నింటినీ ఎదుర్కొని చివరికి రిషబ్ శెట్టి మూడు నెలలు తీవ్రంగా కష్టించి సినిమాని పూర్తి చేశారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. గత మూడు నెలల నుండి తిండి,నిద్ర అన్ని మానేసి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసాము.ఇక ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఏకంగా నాలుగు సార్లు చావు బతుకుల నుండి బయటపడ్డాను. ఈ సినిమా పూర్తి చేయాలని మేము తీవ్రంగా శ్రమించాము. అలాగే ఆ దేవుడి ఆశీస్సులు నామీద ఉన్నాయి కాబట్టే నాలుగు సార్లు చావు నుండి బయటపడ్డాను.

 అంతేకాదు ఈ సినిమా మీద దేవుడి అనుగ్రహం ఉండడం వల్లే షూటింగ్ పూర్తయింది.సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాల భావించి వర్క్ చేశారు..అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు డైరెక్టర్,నటుడు అయినటువంటి రిషబ్ శెట్టి.. ఇక కాంతార మూవీ లో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఇక కాంతార కి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ తన గ్లామర్ తో అలరించబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: