సినిమా కథల ఎంపికలో ఎప్పుడూ అనుకోని ట్విస్టులు జరుగుతుంటాయి. ఒక హీరో వద్దన్న కథను మరో హీరో చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటి ఉదాహరణే అ ఆ సినిమా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సిద్ధం చేసిన ఈ కథ మొదట అక్కినేని నాగ చైతన్య కోసం అనుకున్నారు. కానీ చైతూ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరలేదు. దాంతో ఈ కథ త్రివిక్రమ్ నితిన్‌కి వినిపించగా, అతను వెంటనే ఓకే చెప్పేశాడు. మిగతా కథ అంతా హిస్టరీ! 2016లో విడుదలైన అ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. నితిన్ కెరీర్‌లోనే ఇది టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.


సమంత, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా నచ్చింది. త్రివిక్రమ్ టేకింగ్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాసీ డైలాగ్స్ – అన్నీ కలిసివచ్చి ఈ సినిమాను సూపర్ హిట్‌గా నిలిపాయి. రావు రమేశ్, నదియా, నరేష్ వంటి సీనియర్ నటుల నటన సినిమా రేంజ్‌ని మరింత పెంచింది. నాగ చైతన్య కెరీర్‌ని చూస్తే ప్రేమకథా చిత్రాలే ఎక్కువ. ఏమాయ చేశావే, 100% లవ్, ప్రేమమ్, మజిలీ, లవ్ స్టోరీ వంటి సినిమాలు బాగా నడిచాయి. అలాగే మనమ్, బంగార్రాజు, వెంకీమామ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు కూడా ఆయనకి మంచి హిట్స్‌నే ఇచ్చాయి. కానీ ఒక వేళ అ ఆ మూవీని కూడా చేసి ఉండి ఉంటే చైతూ కెరీర్‌లో మరో  హిట్‌గా నిలిచేది .


ఇక నితిన్ విషయానికి వస్తే, జయం, దిల్, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లే ఆయనను నిలబెట్టాయి. అయితే అ ఆ వంటి క్లాస్ & మాస్ కలయిక ఉన్న సినిమా ఆయనకి ప్రత్యేకమైన హిట్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా నితిన్ ఇమేజ్‌లో పెద్ద మార్పే వచ్చింది. మొత్తం మీద, ఒక హీరో వద్దన్న కథ మరో హీరోకి లైఫ్ ఇచ్చిన ఉదాహరణగా అ ఆ నిలిచిపోయింది. సినీ వర్గాల్లో కూడా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైతన్య ఫ్యాన్స్ “అది మన హీరో చేసినా బాగుండేది” అంటుంటే, నితిన్ ఫ్యాన్స్ మాత్రం “అదే మా హీరో లెవెల్ మార్చింది” అంటున్నారు. ఏదేమైనా, త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన ఈ కథ ఇద్ద‌రు హీరోలకూ ప్రత్యేక చర్చనీయాంశమే అయింది!

మరింత సమాచారం తెలుసుకోండి: