కరుణానిధి గారాలపట్టి కనిమొళి ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరారు. అయితే ఆమె అస్వస్థతకు లోనయ్యారంటూ, ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే డీఎంకే వర్గాలు ఆత్మహత్యాయత్నం ప్రచారాన్ని ఖండిస్తున్నాయి. కరుణానిధి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు ఇక మరోపక్క  డీఎంకేలో అన్నదమ్ముల మధ్య వార్ సాగుతోన్న విషయం తెలిసిందే. కరుణానిది, అళగిరి మధ్య సామరస్యానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై రకరకాల చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం కనిమొళి ఆస్పత్రిలో చేరడం కలకలం రేపింది.  మధ్యాహ్నం ఆమెను భోజనానికి పిలిచేందు కు వెళ్లిన వారు కనిమొళి లేవకపోవడంతో ఆందోళన చెందినట్టు సమాచారం. స్ప­ృహ తప్పి పడి ఉన్న ఆమెను హుటాహుటిన ఆళ్వార్‌పేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కరుణానిధి ఆస్పత్రికి చేరుకుని కనిమొళిని పరామర్శించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే కనిమొళి ఆస్పత్రిలో చేరడం వెనక ఆమె అస్వస్థతకు గురయ్యారా? లేదా ఆత్మహత్యా యత్నం చేశారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇందులో అళగిరి వ్యవహారం వివాదానికి దారితీసినట్లు సమాచారం. అళగిరిని వెనకేసుకువచ్చిన కనిమొళిపై కరుణానిధి ఆగ్రహించినట్లు సమాచారం. తండ్రి మందలించడంతో కనిమొళి ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం స్లీపింగ్ పిల్స్ వేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని డీఎంకే వర్గాలు ఖండిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో కనిమొళి బిజీగా ఉంటూ విశ్రాంతి లేక అస్వస్థతకు గురైనట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: