ఉత్తరాంధ్రా జిల్లాలలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆయన ఎన్నో సార్లు మంత్రిగా పనిచేశారు. పలు కీలకమైన శాఖలు కూడా చూశారు. ఆయనది మూడు దశాబ్దాల అనుభ‌వం

అటువంటి బొత్స సత్యనారాయణ క్రియాశీల రాజకీయాలు వద్దు అనుకుంటున్నారని ప్రచారం గట్టిగానే సాగుతోంది. ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. బొత్స సత్యనారాయణ జగన్ క్యాబినెట్ లో మునిసిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఎందుకో గతంలోలా చురుకుగా లేదు. దానికి ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం వల్లనే అన్న జవాబు వస్తోంది. బొత్స అపుడపుడు మీడియా ముందు కనిపిస్తున్నారు తప్ప పెద్దగా మాట్లాడడంలేదు.

అయితే తన ఆరోగ్య కారణాల రిత్యా తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్ళాలని బొత్స భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏపీ నుంచి ఖాళీ అయ్యే ఆరు సీట్లలో ఒకటి తనకు కేటాయించాలని బొత్స నేరుగా సీఎం జగన్ ని కోరినట్లుగా చెబుతున్నారు. అంటే ఆయన పెద్దల సభకు వెళ్తారన్న మాట. అయితే ఈ విషయంలో వేరే రకమైన ప్రచారం కూడా సాగుతోంది.

బొత్సను పెద్దల సభకు పంపించి విజయనగరం నుంచి వేరే వారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో భాగంగా బొత్స తప్పుకుంటున్నారా నిజంగా ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండబట్టేనా అన్నది క్లారిటీ లేదు. ఆరోగ్య సమస్యలు అయితే రాజ్యసభకు ఎందుకు వెళ్తారు అన్న చర్చ కూడా ఉంది. అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తరహాలో మరో మంత్రి పెద్దల సభకు వెళ్లబోతున్నాడు అన్న మాట. ఏది ఏమైనా జగన్ క్యాబినెట్ లో ఇక మీదట సీనియర్లు కనిపించరు అన్న టాక్ కూడా ఉంది. చూడాలి మరి.





మరింత సమాచారం తెలుసుకోండి: