ఈ రోజుతో ముగియనున్న ఒలింపిక్ గేమ్స్ 2020 లో భారత్ కథ ముగిసింది. ఈసారి కరోనా కారణంగా 2020 లో జరగాల్సిన ఒలింపిక్ గేమ్స్ 2021 లో నిర్వహించారు. ఇందులో భారత్ పథకాల పంట పండించింది. నిన్న జరిగిన పురుషుల జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించి దేశాన్ని తలెత్తుకునేలా చేశారు. దీనితో ప్రముఖులంతా నీరజ్ చోప్రాను ప్రశంసలతో మరియు బహుమతులతో ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్ని పతకాలు దక్కినా రెండుబ పతకాలు మాత్రం దేశానికంతటికీ ఎంతో సంతోషానిచ్చాయని చెప్పాలి. వాటిలో ఒలింపిక్స్ లో మొట్టమొదటి పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఒకరు మరియు ప్రముఖ బ్యాడ్మింటన్ పీవీ సింధు ఒకరు. ఇద్దరూ మహిళలే కావడం విశేషం. అయితే ఇప్పుడు జరుగుతుందంతా ప్రాముఖ్యత ఇవ్వడంలోనే అని తెలుస్తోంది.

ఇద్దరూ దేశానికి పతకాలు తీసుకొచ్చినా సింధుకు దక్కిన ప్రాధాన్యత మీరాబాయి చానుకి దక్కడంలేదనే విషయంలో విమర్శలు ఎదురవుతున్నాయి. కానీ అందులోనూ సింధు సాధించింది కాంస్య పతకమే, కానీ మీరాబాయి చాను సాధించింది మాత్రం రజత పతకం. సిందుకన్నా మీరాబాయిదే గొప్ప విజయమని చెప్పాలి. కానీ ఎందుకు సింధుకు అంత హైప్ తీసుకొస్తున్నారు. ఇదంతామీడియా చేసే పనా లేదా సింధునే ఇలా చేసుకుంటోందా అర్ధం కావట్లేదు జనాలకు. సింధు ఇలా ఇండియాకి వచ్చిన క్షణం నుండి ఆమెకు రాచమర్యాదలు జరుగుతున్నాయి. ఏకంగా పీఎం నరేంద్ర మోదీతో ములాఖత్, అలాగే ఏపీ సీఎం జగన్ తో ప్రత్యేక సమావేశం. ఇలా ఎన్నెన్నో జరిగాయి. అంతేకాకుండా సింధు అకాడెమి కోసం ఉచితంగా స్థలాన్ని కేటాయించడం జరిగింది.

మరి మీరాబాయి చాను పరిస్థితి చూస్తే గత ఒలింపిక్స్ లో కొద్దిలో పథకాన్ని కోల్పోయిన మణిపూర్ అమ్మాయి ఈ సారి మాత్రం పట్టు వదలకుండా రజతాన్ని సాధించింది. ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో కరణం మల్లేశ్వరి తర్వాత పతకం సాధించిన రెండవ మహిళ కావడం విశేషం. ఈ మణిపూర్ మణిరత్నానికి ప్రభుత్వం కోటి రూపాయలు మరియు ఏఎస్పీ గా ఉద్యోగాన్ని ఇచ్చింది. ఈమె ఎక్కడా తన విజయానికి గర్వాన్ని ప్రదర్శించలేదు. సాధారణంగానే ఇంటికి చేరింది. అయితే మీడియా కేవలం సింధునే మోయడానికి కారణం ఏమిటి ? ఇలాంటి మీరాబాయి చాను లాంటి క్రీడాకారుణులకు ఆదరణ ఎందుకు కరువవుతోంది అని అంతా ప్రశ్నిస్తున్నారు.

మీరాబాయి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఆఖరుకు తన ట్రైనింగ్ సమయంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే, ట్రక్ డ్రైవర్ ల ఆర్ధిక సహాయంతో ఈ పథకాన్ని సాధించింది. అందుకు ప్రతిఫలంగా ఈ విషయాన్ని బహిర్గతంగా తెలియచేసి తన గొప్ప తనాన్ని చాటుకుంది. డ్రైవర్లకు భోజనం పెట్టి తన మంచి మనసును చూపించింది. కానీ సింధు మాత్రం ప్రధానితో ఐస్ క్రీం తినాలని ఆశపడింది. ఇకనైనా ఇలాంటివారికి మీడియా అండకావాలి, సపోర్ట్ కావాలి అని తెలుసుకుని మీడియా స్పందిస్తే బాగుటుందని పలువురు అంటున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: