బీజేపీ అధికారం కోసం చేస్తున్న అరాచకాలు భరించలేక సొంత పార్టీ నేతలు ఆ పార్టీ వీడుతున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎమ్మెల్యే తన పార్టీ నేతల అరాచకాలు బరించలేక శిరోముండనం చేయించుకున్నాడు. ఆయన ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ ఈ పని చేశారు. బీజేపీ చేసే పాలన ఘోరంగా ఉందని దానికి ప్రాయశ్చితంగా తాను గుండు గీయించుకున్నట్టు త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ తెలిపారు. రాష్ట్ర రాజధాని కలకత్తాలో ఖాళీమాత ఆలయం వద్ద యజ్ఞం చేసి, అనంతరం శిరోముండనం చేయించుకున్నారు. త్రిపురలో బీజేపీ చేస్తున్న రాజకీయ అరాచకం, గందరగోళమైన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు.

అందుకే తాను పార్టీ విడుతున్నట్టు ఆశిష్ తెలిపారు. ఈయన తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె 2024లో మోడీకి సరైన ప్రత్యర్థి అని ఆయన అన్నారు. రెండేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగిన బీజేపీ సీఎం బిప్లవ్ దేవ్ పై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. ఆయన బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తుంది. 2023 వ సంవత్సరం మొదటి మూడునెలలలోనే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికలపై టీఎంసీ కన్ను వేసింది. బీజేపీ పాలనపై నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. కానీ బీజేపీ ఆధ్వర్యంలో త్రిపురలో జరిగిన అరాచక పాలన నన్ను కలచివేసిందని ఆయన అన్నారు. అందుకే రెండేళ్లుగా బీజేపీ చేస్తున్న తప్పుడు పనులన్నిటినీ వివరిస్తున్నా అని ఆయన తెలిపారు.

ఆశిష్ మాట్లాడుతూ తాను పార్టీ, రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసమే పని చేస్తున్నట్టు తెలిపారు. ఆయన ప్రధాని మోడీని కూడా తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ఇష్టానికి ప్రైవేట్ వారికి తాకట్టు పెడుతున్నారు అని ఆయన అన్నారు. ఒకప్పుడు మోడీ సందేశాలు ఆచరించదగ్గట్టుగా ఉండేవి, కానీ ఒకప్పుడు ఆయనే నేను తినను, తిననివ్వను అని లంచాల గురించి చెప్పారు. కానీ నేడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆయన విమర్శించారు. అయితే సొంతపార్టీ నేత ఇంతగా విమర్శించడంపై బీజేపీ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆశిష్ పై తీవ్రంగా చర్యలు ఉండబోతున్నాయని ఆ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp