న‌మ్మ‌కాలు విశ్వాసాలు అన్నవి ఎలా ఉన్నా యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ గురువు మాటెలా ఉన్నా ఆధ్యాత్మిక గురువు అయితే మారారు. గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంత స్వామిని ఆయ‌న న‌మ్ముతున్నారు. గ‌తంలో విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర‌ను న‌మ్మారు. ఆయ‌న కూడా ఈయ‌న‌ను మ‌రియు కేసీఆర్ ను న‌మ్మారు. కొన్ని మార్పుల కార‌ణంగా జ‌గ‌న్ చేస్తున్న ప‌నుల కార‌ణంగా శార‌దా పీఠం ఇదివ‌ర‌క‌టి ప్రేమ‌ను ఏపీ స‌ర్కారుపై చూప‌డం లేదు. అదేవిధంగా జ‌గ‌న్ పాల‌న‌లో హిందూ ఆల‌యాల‌పై జ‌ర‌గుతున్న దాడులు కూడా మ‌రో కార‌ణం అని  కూడా తెలుస్తోంది. దీంతో స్వ‌రూపానందేంద్ర రూటు మార్చారు. జ‌గ‌న్ కు చెప్పి లాభం లేద‌ని అనుకున్నారో ఏమో కానీ త‌న దారి  పూర్తిగా తెలంగాణ వైపుగా మార్చారు. అలా మార్చ‌డం కార‌ణంగా ఆయ‌న కేసీఆర్ ను పొగుడుతున్నారు.

యాదాద్రి ఆల‌య నిర్మాణంలో కేసీఆర్ చూపిన శ్ర‌ద్ధ, చొర‌వ బాగున్నాయ‌ని, ఆల‌యం దేశంలో అతి పెద్ద ఖ్యాతి పొంద‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. గ‌తంలో కేసీఆర్ ను జ‌గ‌న్ ను ఉద్దేశించి ఈ రెండు తెలుగు రాష్ట్రాల అధిపతులూ త‌న‌కు రెండు క‌ళ్ల‌లాంటి వారు అని చెప్పిన స్వామిజీ స‌డెన్ గా రూటు మార్చారు. అయితే జ‌గ‌న్ వీటిపై మాట్లాడ‌క‌పోయినా కొత్త స్వామిజీని కొల‌వ‌డం వెనుక ఉన్న అంత‌రార్థం ఏంట‌న్న‌ది ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు.

స్వ‌రూపానందేంద్ర‌ను దూరం చేసుకుని హిందువుల ఓట్ల‌ను మ‌రింత దూరం చేసుకుంటున్నారా అన్న ప్ర‌శ్న కూడా వ‌స్తోంది. గ‌తంలో విశాఖ శార‌దా పీఠాన్ని త‌రుచూ సంద‌ర్శించి, స్వామికి కానుక‌లు స‌మ‌ర్పించిన జ‌గ‌న్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయా రు. మ‌రో వైపు హిందూ ఆల‌యాల ప‌రిర‌క్ష‌ణ‌పై జ‌గ‌న్ చూపుతున్న శ్ర‌ద్ధ పై ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. వీటిపై స్వామిజీ ఇంత‌వ‌ర‌కూ మాట్లాడ‌కున్నా జ‌గ‌న్ తీరుకు సంబంధించి మాత్రం అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌ధాన ఆలయాల నిర్వ‌హ‌ణ‌లో త‌రుచూ విమ‌ర్శ‌ల పాల‌వుతున్న జ‌గ‌న్, వాటిని నియంత్రించండంలో విఫ‌లం అవుతున్నార‌న్న‌ది ఓ విమ‌ర్శ‌. పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త, అన్ని మ‌తాల‌ను గౌర‌వించే విధానం అన్న‌వి మాట‌లు వ‌ర‌కే ప‌రిమితం అయి చేత‌ల్లో లేవ‌న్న‌ది స్వామీజీ ఉద్దేశం అయి ఉంటుంది. అందుకే జ‌గ‌న్ ను కాద‌ని కేసీఆర్ ను పొగుడుతున్నారు స్వామీజీ.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp