ఏపీలో క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అరవై ఎనిమిది శాతానికి పైగానే పోలింగ్ శాతం జ‌రిగింది. న‌వంబ‌ర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. పోలింగ్ జ‌రిగిన తీరును బ‌ట్టి బద్వేలు ఉప ఎన్నిక ఏకపక్షంగానే జరిగిందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక్క‌డ అధికార వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్ట‌ర్‌ దాసరి సుధ విజయం దాదాపు ఖాయమైనట్లే. అయితే ఇప్పుడు అక్క‌డ ఆమె మెజారిటీ ఎంతనేది చూడాలి.

వైసీపీ నేతలు మాత్రం ముందు నుంచే త‌మ పార్టీకి అక్క‌డ ల‌క్ష‌ మెజారిటీ వస్తుందని లెక్క‌లు వేసు కుంటూ వ‌స్తున్నారు. బద్వేలులో మొత్తం 2,37,022 మంది ఓటర్లు ఉంటే వారిలో దాదాపు 1,30 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నార‌ట‌. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉన్నా ఆ పార్టీ ఇక్క‌డ పోటీ చేయ‌క పోవ‌డంతో ఆ పార్టీ ఓట్లు ఎటు ట‌ర్న్ అయ్యాయ‌న్న‌ది మాత్రం అంతు ప‌ట్ట‌డం లేదు.

అయితే స్థానిక టీడీపీ నేత‌లు మాత్రం లోపాయికారీగా బీజేపీకి స‌పోర్ట్ చేశారు. ఇక టీడీపీ నేత‌లు, నాయ‌కులు కూడా బీజేపీ ఏజెంట్లుగా దర్శనమివ్వడంతో ఆ ఓట్లన్నీ తమకే పడ్డాయన్న ఆశల్లో బీజేపీ ఉంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ  కి ఇక్క‌డ కేవ‌లం 735 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీకి 18, 500 ఓట్లు వ‌స్తాయంటూ భారీ ఎత్తున బెట్టింగులు జ‌రుగుతున్నాయి.

ఇంకా చెప్పాలంటే బీజేపీ కి ఇంకా ఎక్కువ ఓట్లు వ‌స్తాయ‌న్న అంచ‌నాలు కూడా ఉన్నాయి. ఓవ‌రాల్ గా చూస్తే వైసీపీ పెట్టుకున్న ల‌క్ష ఓట్ల మెజార్టీ అయితే రాద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. అదే జ‌రిగితే బ‌ద్వేల్లో జ‌గ‌న్ పెట్టుకున్న అంచ‌నాలు అయితే పూర్తి గా అందు కోన‌ట్టే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: