నాయ‌కుడు అంటే ప్ర‌జ‌ల్లో నుంచి పుట్టిన‌వాడు.. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసేవాడు. ఇలాంటి నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి గొప్ప నాయ‌కుడి కొడుకుగా పుట్టిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో నిర్వ‌హించిన‌ పాద‌యాత్రతో జ‌నంలోకి వెళ్లాడు. ఈ పాద‌యాత్ర‌తో క్షేత్ర‌స్థాయిలో జిల్లాల్లో, మండ‌లాల్లో, గ్రామాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల గుండెల్లో ఉన్న బాధ‌ల‌ను, సమ‌స్య‌లను స్వ‌యంగా విన్నాడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్ర‌జ‌ల‌ను హ‌త్తుకుని అవ్వా, అయ్యా, చెల్లెమ్మ‌, తమ్ముడు అంటూ వాళ్ల మ‌న‌సును గెలుచుకున్నాడు.


   ఈ క్ర‌మంలో వైఎస్ఆర్ కొడుకుగా ప్ర‌జ‌ల‌ నీరాజ‌నాలు కూడా అందుకున్నారు. 14 నెల‌లు సాగిన ఈ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో వేలమంది ప్ర‌జ‌లు జ‌గ‌న్‌మోహ‌నుడి వెంట నిల‌బ‌డ్డారు. పులివెందుల నుంచి ఇచ్చాపురం వ‌ర‌కు న‌డిచిన జ‌గ‌న్‌కు అడుగడుగున ఆహ్వానం ప‌లికారు జ‌నాలు. 13 జిల్లాల్లో నిర్వ‌హించిన 55 ఆత్మీయ స‌మావేశంలో ప్ర‌సంగించించాడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అప్ప‌టి ప్ర‌భుత్వం తీసుకున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు, అవ‌లంభించిన విధానాలను ల‌క్ష్యంగా చేసుకుని మాట్లాడిన తీరు వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు మ‌రింత చేరువ‌కావ‌డానికి వార‌ధిగా మారింది.


  జ‌నం మ‌ధ్యే అడుగు వేసిన జ‌గ‌న్.. జ‌నం మ‌ధ్యే విడిది చేశారు. వారితోనే క‌లిసి ప్ర‌యాణించారు. నేను ఉన్నాను అంటూ జ‌నానికి భ‌రోసా క‌ల్పించాడు జ‌గ‌న్‌. చ‌దువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే ప‌రిస్థితుల‌ను తాను చూసాన‌ని, ఇవి తొల‌గిపోయేందుకు ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడు అండ‌గా ఉంటాన‌ని హామి ఇచ్చారు జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి.  మ‌తాల‌కు, కులాల‌కు అతీతంగా  వివ‌క్ష‌లేని పాల‌న‌ను అందిస్తాని చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీల‌ను నిల‌బెడుతూ అధికారం చెప‌ట్టిన త‌రువాత  నిర్ణ‌యాలు తీసుకున్నారు. అవ్వాతాత‌ల‌కు ఫించ‌న్ పెంచుతాని ఇచ్చిన హామీని సీఎం అయిన తొలి సంత‌కంతోనే నెర‌వేర్చారు. అధికారం చేప‌ట్టి రెండున్న‌రేళ్లు పూర్త‌వుతున్నా జ‌నం గుండెల్లో జ‌గ‌న్ కు ఉన్న స్థానాన్ని ఇంకా నిల‌బ‌ట్టుకున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: