అంతరిక్షం లో ఉన్న తమ సొంత శాటిలైట్ ను రష్యా తాజాగా తమ యాంటీ-శాటిలైట్ క్షిపణి ని పరీక్షిస్తున్నామన్న పేరుతో పేల్చి వేసింది. ఈ చర్య కారణంగా వెలువడిన శకలాల కారణంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది దిక్కు తోచని స్థితిలో క్యాప్స్యూల్స్ లోకి వెళ్లి దాక్కున్నారు. ఈ చర్య ను బట్టి రష్యా ప్రయోగం ఒక మతి లేని చర్యగా అమెరికా అభివర్ణించింది. అంతే కాకుండా రష్యా ప్రయోగం ప్రమాదకరం మరియు నిర్లక్ష్య పూరితమైనది ..అంతే కాకుండా రష్యా చేసిన మతి లేని చర్యవలన ఐఎస్ ఎస్ లో ఉన్న దాదాపు ఏడుగురు సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టిందని అమెరికా ఖండించింది .


అయితే  ఐఎస్ ఎస్ లో ఉన్న ఏడుగురిలో నలుగురు అమెరికన్లు , ఒకరు జపాన్ కి చెందినవారు , ఇద్దరు రష్యన్లు అన్నట్లు అమెరికా తెలిపింది.  16 నవంబర్ 2021 రోజు ఉదయం రష్యన్ ఫెడరేషన్  బాధ్యతారాహిత్యం గా సాటిలైట్ ను ద్వాంసం చేసింది  . రష్యా పనిచేయని తమ  సొంత శాటిలైట్ ను  యాంటీ-శాటిలైట్ మిసైల్‌ను ఉపయోగించి పేల్చివేసింది. అమెరికా విదేశాంగ ప్రతినిది నెడ్ ప్రైస్ మీడియా సమావేశం లో ఈ విషయాలను  పేర్కొన్నారు. రష్యా తన యాంటీ-శాటిలైట్ మిసైల్‌ ప్రయోగం వల్ల దాదాపుగా 1500 ముక్కల  శాటిలైట్ శకలాలు , వేలాదిగా విశ్వం లో కలసిపోయిన చిన్న చిన్న శాఖలాలను సృష్టించింది. ఇవన్నీ కూడా కక్షల్లో తిరుగుతూ ఇతర దేశాల ప్రయోజనాలకు ముప్పు తెస్తాయి అంటూ అయన వివిరించారు. 


 అంతే కాకుండా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అధిపతి బిల్ నెల్సన్ ఈ చర్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్నీ  రష్యా అంతరిక్ష సంస్థ రాస్కోస్మోస్ చాలా తేలికగా తీసిపారవేసింది . అంతే కాకుండా ‘‘తమ శాటిలైట్  కక్ష్య.. ఐఎస్ఎస్ కక్ష్యకు దూరంగా ఉంది . ఐఎస్ఎస్‌లోని ఏడుగురు సిబ్బంది ప్రామాణిక విధానాల పరంగా  స్పేస్‌క్రాఫ్ట్‌లోకి వెళ్లక తప్పలేదు . అంతే కాకుండా  ఆ స్టేషన్ గ్రీన్ జోన్‌లోనే  ఉంది’’ అని రష్యా అంతరిక్ష సంస్థ రాస్కోస్మోస్ ట్వీట్ చేసింది. పేలుడు సంభవించినప్పుడు బయటకు వచ్చిన శాఖలాలు ఎలాంటి ప్రమాదం లేకుండా దూరంగా సాగిపోయాయి . కానీ ఆ గ్రహ శకలాలు మూలం ఏంటని ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. అయితే ప్రస్తుతం రష్యా పేల్చివేతకు గురైన శాటిలైట్ 1982 లో ప్రయోగించ బడిన రష్యా గూఢచర్య  శాటిలైట్ కాస్మోస్-1408  గా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఉన్న గ్రహ శాఖలాలు ఈ శాటిలైట్ నుండి వెలువడ్డాయని భావిస్తున్నారు. 

IHG


ఈ శాటిలైట్ బరువు దాదాపు టన్ను కు పైమాటే . అయితే ఈ సాటిలైట్ చాలా ఏళ్లుగా నిష్ప్రయోజనంగా ఉన్నట్లు తేలుస్తూఉంది. ప్రస్తుతం ఈ శాటిలైట్ ఉండవలసిన స్థానం లో అనేక గ్రహ శకలాలు ఉన్నట్లు గుర్తించారు . అయితే ఈ విషయాన్నీ న్యూజిలాండ్‌ లో ఉన్న అమెరికా రాడార్ వ్యవస్థ ద్వారా  లియోల్యాబ్స్ కనుగొంది. రష్యా చర్య ‘ చాలా ప్రమాదకరం మరియు  బాధ్యతారహితం’ అని ప్రైస్ మండిపడ్డారు . అంతరిక్షంలో ఆయుధాలను మోహరించటానికి తాము వ్యతిరేకమని చెబుతున్న  రష్యా నిజాయితీ బూటకమని ఈ చర్య  చాటిచెప్తోందన్నారు. అంతే కాకుండా రష్యా బాధ్యత రాహిత్య చర్య ను ఖండించడానికి అమెరికా భాగస్వామ్య దేశాలతో , మిత్రులతో కలసి పని చేస్తున్నట్లు అయన తెలిపారు.రష్యా తప్పుడు చర్య వల్ల మున్ముందు అంతరిక్షం లోకి వెళ్లే శాటిలైట్లకు , అంతరిక్ష ప్రయాణికులకు  ప్రమాదకరం గా మారనుంది  అని అయన పేర్కొన్నారు.  


గతం లో కూడా చైనా కాలం చెల్లిన తమ వాతావరణ ఉపగ్రహాలలో ఒక శాటిలైట్ ను  2007 లో ద్వాంసం చేసింది . ఆ విస్ఫోటనంలో ఆచూకీ తెలుసుకోగలిగిన 2000 పైగా వ్యర్దాలను కనుగొన్నారు. అంతే కాకుండా ఆ చర్య వలన చైనా తో సహా  i అనేక దేశాలు  ఇప్పటికి తమ అంతరిక్ష కార్యకలాపాలను అంతరాయం ఏర్పడుతునే ఉంది . ఇలాంటి వ్యర్ధాలు అంతరిక్షం లో అతివేగంగా తిరుగుతూ అడ్డువచ్చిన ఏ అంతరిక్ష వాహనాన్నైనా ద్వాంసం చేయగలవు . అంతే కాకుండా అంత రిక్షం లో ఉన్న ఉపగ్రహాలను సైతం అవి పనికిరాకుండా చేయగలవు. ఐఎస్ఎస్ మాడ్యూళ్లకు గ్రహ శాఖలాలు  చాలా సులభంగా రంధ్రాలు చేయగలవు. ఇలాంటి దిక్కు తోచని పరిస్టులలో వ్యోమగాములు తమను తాము రక్షించుకోవడానికి మరియు భూమి మీదకు రావడానికి క్యాప్స్యూల్స్ లోకి వెళ్లిపోతుంటారు . ఈ వాహనాలు ఇటువంటి ప్రమాదాలనుండి తప్పించుకోవడానికి లైఫ్ బొట్లు గా ఉపయోగ పడుతుంటాయి .  


మరింత సమాచారం తెలుసుకోండి: