2024 సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలకు పైగా సమయం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అప్పుడే రాజకీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది అనే చెప్పాలి. ఎక్కడైనా ఎన్నికలు ఏడాది ఉన్నప్పుడే రాజకీయ వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రాజకీయం కాస్త హాట్ హాట్ గా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దెదింపేందుకు తెలుగుదేశం జనసేన పార్టీ లు కలిసి పని చేస్తాయని ... ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయ‌ని ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతోంది.

2014 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ బిజెపికి సపోర్ట్ చేసింది. ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం - బిజెపి - జనసేన విడివిడిగా పోటీ చేశాయి. ఈ మూడు పార్టీల మ‌ధ్య‌ ఓట్లు చీల్చి పోవడంతో వైసిపి రికార్డు మెజార్టీతో విజయం సాధించింది. ఇక ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు వార్తల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు టెన్షన్ పడుతున్నారు.

జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో తమకు సీటు ఉండదని.. ఇప్పటికే రెండున్నర సంవత్సరాలుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజల్లో ఉంటున్నాం... రేపటి రోజున జనసేన తో పొత్తు ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ఏం అవుతుందని వారు వాపోతున్నారు.

ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా తో పాటు ఉభయ గోదావరి జిల్లాలు - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే కాస్త ఆందోళనతోనే ఉన్నారు. ఈ పొత్తు ఎక్కడ తమ కొంప కొల్లేరు చేస్తుందో అన్న భయంతో వారిలో ఉంది. పొత్తు కుదిరితే ఆ పొత్తులో బీజేపీ కూడా ఉంటే టీడీపీ లో దాదాపు 40 మందికి పైగా నేత‌లు త‌మ సీట్లు త్యాగం చేయక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉంటుంది. మ‌రి ఏం జ‌రుగుతుం దో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: