టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ అధినేత జగన్ అవినీతి గురించి మాట్లాడారు.. జగన్ కంపెనీలు సక్రమంగా పన్నులు కడుతున్నాయని.. జగన్ సంస్థలు అవినీతికి పాల్పడం  లేదని..ఐటీ శాఖ క్లియరెన్స్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. జగన్‌ సంస్థల్లో అక్రమ పెట్టుబడులు లేవని ఐటీ శాఖ చెప్పిందన్న విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక జగన్ అవినీతి గురించి చెప్పమంటే.. రెచ్చిపోయే విపక్ష నేత చంద్రబాబు.. ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.


ఐటీ శాఖకు ట్యాక్స్‌ కడితే చాలు... ఇక అవినీతి లేనట్టే  అంటే ఎలా కుదురుతుంది అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలు ఇలా వ్యవహరిస్తే అక్రమార్కులకు రాజకీయం ఒక వ్యాపారం అవుతుందని చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. అందుకే చట్టసవరణల  ద్వారా రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు కోరారు. ఐటీ శాఖ చెబుతున్నట్టు జగన్‌ది అవినీతి కాదు అనుకుంటే..  ఇక ఈ దేశంలో ఒక్క అవినీతిపరుడిని కూడా లేనట్టేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు.


జగన్ అవినీతిని  కేంద్రం పట్టుకోలేకపోతుందని పట్టుకోలేకపోతోందని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరుతున్నారు. అంటే చంద్రబాబు మాటలను బట్టి చూస్తే..  ఇప్పటికిప్పుడు జగన్ ఆస్తులపై కేంద్రం ఈడీ, సీబీఐతో దాడులు చేయించాలన్నమాట. గతంలో జగన్ అవినీతి లక్ష కోట్లు అంటూ ఓ నంబర్‌ను ఫిక్స్ చేసింది కూడా తెలుగు దేశం పార్టీయే. అయితే జగన్ పై ప్రస్తుతానికి ఉన్నవి ఆరోపణలే.. అవి ఏవీ నిరూపణ ఇంకా కాలేదు.. ఇప్పట్లో అవుతుందన్న ఆశా కనిపించడం లేదు.


కానీ.. చంద్రబాబు మాత్రం కేంద్రం జగన్ వంటి ఆర్థిక నేరగాడిని చూస్తూ వదిలేసిందన్న భావనలో ఉండిపోయారు. ఇప్పటికైనా జగన్ పై కేంద్రం ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు డిమాండ్ చేశాడని జగన్ పై మోదీ విచారణ చేయిస్తారా.. అంటే అది కూడా జరిగే పనికాదు.. కానీ మొత్తానికి చంద్రబాబు మాత్రం జగన్‌ను విచారించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: