ఏపీలో జిల్లాల విభజన ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య అనేక వివాదాలు తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు. జిల్లా కేంద్రం కొరకు జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఎక్కడో ప్రకంపనలు తీసుకొస్తున్నాయి. ఈ వివాదాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అంచనా వేయలేకపోతున్నారు స్థానిక నేతలు. జిల్లా విభజన ప్రక్రియలో భాగంగా కడప జిల్లాలోని రాజంపేటలో రాజకీయ పక్షాల మధ్య చిచ్చు పుట్టింది.  ఇప్పటివరకు రెవెన్యూ డివిజన్ గా ఉన్నటువంటి రాజంపేటను జిల్లా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో ఎవరు కూడా ఊహించని విధంగా ప్రతిపాదించారు. కొత్త జిల్లాకు రాయచోటి జిల్లా కేంద్రం. ఈ యొక్క ప్రతిపాదనలు తెలియగానే రాజంపేట లోని రాజకీయం వేడెక్కింది.

అందులో ముఖ్యంగా వైసీపీ నేతలే  రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు అని చెప్పవచ్చు. కొందరైతే వారి యొక్క ఆవేదనను సెల్ఫీల రూపంలో విడుదల చేశారు. మరి కొందరు రాజీనామా చేస్తామని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఇలా నేతలు పోటాపోటీగా రంగంలోకి దిగి మరి జిల్లా కేంద్రం సాధించడం కోసం ఉద్యమం చేపట్టారు. రాజంపేట ను జిల్లా కేంద్రానికి చేయాలని కోరుతూ కలెక్టరుకు జడ్పీ చైర్మన్ వర్గం వినతి పత్రం అలాగే ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి వర్గం కూడా పోటా పోటీగా ఉద్యమాన్ని చేపట్టారు. వీరంతా ఇతర పార్టీలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసారు. ఈ యొక్క కమిటీలో ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి  చిన్నాన్న కుమారుడు మేడం విజయ్ శేఖర్ రెడ్డి యొక్క ఆధిపత్యం కనిపించడంతో అమర్నాథ్ రెడ్డి వర్గం మెల్లగా జారుకున్నడని ఉద్యమం పిక్ స్థాయికి చేరిన

 సమయంలో జిల్లా సాధన కోసం ఎమ్మెల్యే తన సోదరుని అడ్డం పెట్టుకోని రాజకీయాన్ని చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇంతలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని అమర్నాథ్ రెడ్డి వర్గం కలెక్టర్కు వినతిపత్రం అందించింది. అయితే ఈ యొక్క సమస్య మంచి వేడి మీద ఉన్న సమయంలోనే మల్లికార్జున్ రెడ్డి ఆయన సోదరుడు రఘునాథ రెడ్డి మరియు జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, ఎంపీ  మిథున్ రెడ్డి అలాగే రైల్వేకోడూరు ఎమ్మెల్యే  శ్రీనివాసులు  ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: