ఏపీలో సీఎం జగన్ దేశంలోనే తొలిసారిగా ఒకే నోటిఫికేషన్ తో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చారు. అది కూడా రికార్డు సమయంలో నియామకం పూర్తి చేశారు. అయితే ఈ పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని.. పేపర్ లీకైందని ఆంధ్రజ్యోతి పత్రిక వరుస కథనాలు రాసింది. కానీ ఎందువల్లో వాటికి రావాల్సినంత ప్రభావం రాలేదు. తెలుగుదేశం పార్టీ కొంత వరకూ విమర్శలు చేసినా జనం కూడా పెద్దగా పట్టించుకోలేదు.


ఇప్పుడు ఆ అంశంపై విజయసాయిరెడ్డి టీడీపీ నేతలతో పాటు ఎల్లో మీడియాపైనా విమర్శలు చేశారు.. “మీ బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచిపెట్టినా మీ అరాచకాలన్నింటినీ సోషల్ మీడియా బయటపెట్టిందనేనా ఈ ఏడుపు.. అని చంద్రబాబును ఉద్దేశించి విజయ సాయిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్ర'జ్యోతి' ఎంత చిచ్చు పెట్టాలని చూసినా లాభం లేకుండా పోయిందన్నదే సారు అసలు బాధ అంటూ ఎద్దేవా చేశారు. అయినా మీ పుత్రరత్నం పెట్టిన ట్వీట్లేమైనా సుమతీ శతకాల్లా అనిపిస్తున్నాయా? అని విజయసాయిరెడ్డి నిలదీశారు.


సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ తమపై దారుణంగా ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలనను విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. వైయస్‌ఆర్‌సీపీ పైనా, వైయస్‌ జగన్ గారి పైనా నీచపు రాతలు రాసేందుకు వేలమందిని నియమించి 24 / 7 కాల్ సెంటర్లను నిర్వహించింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు గారూ ! అంటూ విజయసాయి ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు.



సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు పోస్టులు పెట్టుకుంటారని, మీకు నచ్చకపోతే ఎఫ్ బీ కి ఫిర్యాదు చేయొచ్చని హితవు పలికారు. "సిగ్గులేని బతుకులు ఎవరివో ఐదుగురి పేర్లు చెప్పమంటే ఆ తండ్రీకొడుకుల పేర్లే ఫస్టుంటాయి. ఆ లిస్టులో కిరసనాయిలు తప్పనిసరిగా ఉంటాడు. వీళ్లు జన్మలో మారరు. వీళ్ల దృష్టిలో ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛకు నిర్వచనాలు వేరే ఉంటాయి" అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: