ఆంద్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ  సమావేశాలు  ఈ రోజు ప్రారంభమైయ్యాయి.  అందులో  భాగంగా  ప్రస్తుతం మహిళల భద్రత గురించి స్వల్ప కాలిక  చర్చ జరుగుతుంది.  ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. రాష్ట్రంలో  మహిళల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో  సలహాలు ఇవ్వాలని   ప్రతిపక్ష సభ్యులను కూడా కోరాడు. ఈ  చర్చలో భాగంగా ఇటీవల దేశ  వ్యాప్తంగా  సంచలనం సృష్టించిన  శంషాబాద్  దిశ హత్యాచార ఘటన  పై జగన్  స్పందించారు.
 
 
దిశ ఘటన సభ్య సమాజం  సిగ్గుతో తలదించుకోవాల్సిన  ఘటన  26ఏళ్ళ  ఓ అమ్మాయిని రేప్ చేసి  దారుణంగా సజీవ  దహనం చేశారు.  ఇలాంటి ఘటన మన ఏపీ లోనే   జరుగుతే పోలీసులు ఎలా స్పందించాలి ,మనం  ఎలా  స్పందించాలని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.  నాకు  ఇద్దరు ఆడపిల్లలు వున్నారు ఒక చెల్లి వుంది భార్య వుంది.  భార్య  మాత్రమే  ఒక్కతే  అధ్యక్ష అని  సీఎం జగన్ అనడం తో అసెంబ్లీ  లో  వున్న సభ్యుల ముఖాల్లో  నవ్వులు పూశాయి.  ఇన్ డైరెక్ట్ గా  జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జగన్ అలా  అన్నారని అర్ధమవుతుంది.  ప్రస్తుతం ఉల్లి ధర  పెరగడం పై ప్రభుత్వం కు వ్యతిరేకంగా  ట్వీట్లు చేస్తూ విమర్శలు చేస్తున్నాడు  పవన్.  దానికి  కౌంటర్ గానే   జగన్   తాజాగా  పవన్ పై సెటైర్ వేశారు.  ఇక  దిశ నిందితుల ఎన్ కౌంటర్  ను స్వాగతించిన  జగన్ ..  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ,పోలీసుల పై ప్రశంసలు కురిపించారు. అయితే  ఎన్ కౌంటర్  పై జాతీయ మానవ హక్కులు  కమిషన్  విచారణ చేపట్టడాన్ని  జగన్ తప్పుబట్టారు. ఇటువంటి  చట్టాలను మార్చాలిసినవసరం వుంది తప్పు చేస్తే  వెంటనే  శిక్షపడేలా  చట్టాలను తీసుకరావాలని  జగన్ పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: