ఔను. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఇంట్లో వివాహం. దానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతోంది...టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వియ్యం ఇచ్చేవారు, వియ్యం అందుకునే వారు ఇద్దరూ...ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితులే కావడం అసలు ట్విస్ట్. ఇంతకీ ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరంటే...హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.
మళ్లీ బాబును బుక్ చేసిన లోకేష్...జగన్‌కు ఎంత మంచి చాన్స్ ఇచ్చేశాడు కదా?
ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా సోదరి ఆనం మీర్జా కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్‌ను వివాహమాడనున్నారు. స్ట్రైలిస్ట్ అయిన ఆనంమీర్జా న్యాయవాది అయిన అజారుద్దీన్ కుమారుడు అసద్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అజారుద్దీన్ కుమారుడు అసద్‌తో తన చెల్లెలు ఆనంమీర్జా పెళ్లి అని సానియా మీర్జా అక్టోబరు నెలలో ప్రకటించారు. ఈ పెళ్లితో రెండు క్రీడా కుటుంబాలైన అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాలు బంధువులు కానున్నాయి. ఈనెల 12న అసదుద్దీన్, ఆనం మీర్జా వివాహ విందు జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రగతిభవన్‌లో కలిశారు. అసదుద్దీన్, ఆనమ్ మీర్జా వివాహ విందు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని అజహర్, సానియా సీఎంను కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
వైఎస్ మొదలుపెట్టాడు...కేసీఆర్ పూర్తిచేశాడు..హైదరాబాద్ ఖాతాలో ఇంకో రికార్డు
కాగా, మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్‌ను నిఖా చేసుకున్న ఆనమ్ ప్రస్తుతం విడాకులు తీసుకుని అసదుద్దీన్ వివాహమాడబోతుంది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కాగా, సానియా మీర్జా వధువు తన సోదరి ఆనంమీర్జాతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ సోదరి పెళ్లి వేడుక గురించి ప్రస్థావించారు. స్ట్రైలిస్ట్ అయిన ఆనంమీర్జా న్యాయవాది అయిన అజారుద్దీన్ కుమారుడు అసద్ ను వివాహమాడనుంది. ఆనంమీర్జా కూడా తన ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘మంచి స్నేహితులైన కుటుంబసభ్యులను పొందుతుండటం నాకెంతో థ్రిల్‌గా, ఆనందంగా ఉంది’’ అని ఆనంమీర్జా వ్యాఖ్యానించారు.