జగన్ మూడు రాజధానులు ప్రకటన రాజకీయంగా సంచలనం కలిగించింది. అమరావతి నీ చంపేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్ర బాబు, లోకేశ్ ఆరోపిస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు కూడా దీటుగా బదులు ఇస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో వేల ఎకరాలను నిరుపేద రైతుల నుంచి లాక్కుని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డాం.. దమ్ముంటే మా తప్పులను వెతుక్కోండి అని బాబు, లోకేశ్ చాలెంజ్‌ చేస్తున్నారన్నారు.

 

 వీరిని చూస్తుంటే తనకు ఒక గుర్తుకు వస్తుందని వివరించారు. ‘ముగ్గురు స్నేహితులు ఒక షాపుకు వెళ్లి రూ.30 పెట్టి మూడు యాపిల్స్‌ కొనుగోలు చేశారు. ఆ షాపు యజమానితో బేరం ఆడితే రూ.5 రిటన్‌ ఇస్తాడు. దాంట్లో ఒక్కో రూపాయి తీసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక యాపిల్‌ రూ. 9కి పడింది. మూడు కలిపితే రూ.27 అవుతుంది. మిగిలింది రూ.2, మొత్తం కలిపితే రూ.29 లెక్క వస్తుంది. మిగతా రూ.1 ఏమైనట్లు’..? టీడీపీ నేతలు మాటలు వింటుంటే తన కుమారుడు అడిగే కథ గుర్తుకు వస్తుందన్నారు. అమరావతిలో జరిగిన భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

చంద్ర బాబు పాలన గురించి ఆయన కొన్ని గణాంకాలు వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు రాష్ట్రంలో చివరి ర్యాంకుల కోసం పోటీ పడుతున్నాయని సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఇచ్చిన డేటా ఆధారంగా 2017 నుంచి 2018 వరకు శ్రీకాకుళం 3.8 జీడీపీ, విజయనగరం 3.5 జీడీపీ రాష్ట్రంలో చివరిస్థానాల్లో నిలిచాయి. అదే విధంగా బ్రాడ్‌ సెక్టార్‌ వైజ్‌ గ్రాస్‌ వాల్యూ ఆడిడ్‌ 2017–18లో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా ఉంటే 12వ ర్యాంకులో శ్రీకాకుళం, 13వ ర్యాంకులో విజయనగరం జిల్లా ఉంద ని సీదిరి అప్పలరాజు అన్నారు.

 

 

ఇండస్ట్రీ సెక్టార్‌ జీవీఏ 2017–18లో శ్రీకాకుళానికి మైనింగ్‌ అండ్‌ క్వారింగ్‌లో ర్యాంకు 11, విజయనగరానికి 13, మ్యానిఫ్యాక్టరింగ్‌లో శ్రీకాకుళం జిల్లాకు 13, విజయనగరం 9వ ర్యాంకు, ఇండస్ట్రీ సెక్టార్‌లో శ్రీకాకుళం 12, విజయనగరం 13వ ర్యాంకు. ఎలా చూసుకున్నా.. రెండు జిల్లాలు అత్యధికంగా వెనుకబడ్డాయి. సెక్టార్‌ వైజ్‌ పర్సంటేజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ చూస్తే జీడీపీలో అగ్రికల్చర్‌ అండ్‌ ఎలీడ్‌ శ్రీకాకుళం జిల్లాకు 13, విజయనగరం జిల్లాకు 12వ ర్యాంకు, ఇండస్ట్రీలో శ్రీకాకుళం 12, విజయనగరం 13వ ర్యాంకు, సర్వీసెస్‌లో శ్రీకాకుళం 12, విజయనగరం 13వ ర్యాంకు, టోటల్‌ పర్సంటేజ్‌ ఉన్న కంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ జీడీపీలో శ్రీకాకుళం 12, విజయనగరం 13వ ర్యాంకులో ఉన్నాయన్నారు సీదిరి అప్పలరాజు.

 

 స్వాత్రంత్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఏనాడూ కూడా మారుమూల జిల్లాలను ఏ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపించలేదన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు సీదిరి అప్పలరాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: