తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. రానురాను తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలు బలపడుతున్నాయి గాని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే ఉండటంతో ముఖ్యంగా పార్టీలో రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులు పార్టీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నట్లు ఎక్కువ కామెంట్ కింద క్యాడర్ నుండి వస్తున్న తరుణంలో ఇదే విషయాన్ని ఢిల్లీలో ఉన్న సోనియా కూడా గుర్తించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత పగ్గాలు రేవంత్ రెడ్డి చేతిలో పెట్టడానికి సోనియాగాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని అలాగే బిజెపి పార్టీ నేతలని ఇతర నాయకులను గట్టిగా కౌంటర్ ఇచ్చే విధంగా తెలంగాణ కాంగ్రెస్ లో మంచి చరిష్మా ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి కి మంచి పేరు ఉండటంతో సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మ‌ల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ స్థానికంగా అక్కడ ప్రజల బాధ్యతలను వారి బాధలను సమస్యలను తెలుసుకుంటూ మ‌ల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి పరిమితం కావడం జరిగింది.

 

అయితే మరోపక్క రేవంత్ రెడ్డికి పార్టీ పీసీసీ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నా సోనియాగాంధీ తన పార్లమెంటు నియోజకవర్గంలో మరియు అదే విధంగా సొంత నియోజకవర్గం కొడంగల్ లో హోండా మున్సిపాలిటీలను కార్పోరేషన్ లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా రాణిస్తే కచ్చితంగా టీపీసీసీ పదవిని రేవంత్ రెడ్డి కె ఇవ్వాలని సోనియా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోపక్క పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొడంగల్ మరియు మ‌ల్కాజ్ గిరీ… ఈ రెండు చోట్లా పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే విధంగా రేవంత్ రెడ్డి రాణించలేకపోతే పూర్తిగా ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ వాయిస్ వినిపించనీవ్వకుండా తొక్కేసే ఆలోచనలు చేస్తున్నట్లు టీ కాంగ్రెస్ పార్టీలో వినికిడి. 

మరింత సమాచారం తెలుసుకోండి: