ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఈ మేరకు నిధులు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీలోని కడప జిల్లాలో స్థాపించిన కడప ఉక్కు కర్మాగారం, గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ కు కేంద్రం బడ్జెట్లో నిధులకు పెద్ద పీట వేస్తూ ఉందా.. లేదా అన్న దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి ఏపీ విభజన సమయంలో కడప ఉక్కు పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలనే దానిపై విభజన చట్టం హామీల్లో పేర్కొన్నారు. కానీ తదనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు విముఖత చూపింది. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగానే కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టింది. కానీ పలు కారణాల రీత్యా ఆశించిన స్థాయిలో కడప ఉక్కు కర్మాగారం పనులు ముందుకు సాగలేదు. అనంతరం ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రారంభించాలని కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.

 

 అందులో భాగంగానే ఇటీవల జాతీయ అభివృద్ధి సంస్థ తో ముడి సరుకులు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం జాతీయ అభివృద్ధి సంస్థకు తదితర అవసరాల రీత్యా మూడు వేల ఐదు వందల పైచిలుకు ఎకరాల భూమిని కేటాయించారు. ఇంత చేసిన కేంద్ర సహకారం అనేది తప్పనిసరిగా మారింది. ఇంత పెద్ద ఉక్కు పరిశ్రమను పూర్తి చేయాలంటే కేంద్రం తన వంతు సహకారం అందించడం ఖచ్చితంగా చేయాల్సిందే. లేనిపక్షంలో నిధుల కొరతతో ఉక్కు పరిశ్రమ ముందుకు సాగే పరిస్థితులు లేవు. ఇదిలా ఉంటే మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎయిమ్స్ పరిస్థితి గందరగోళంగానే ఉంది. ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు 25 శాతం పనులకు మించి పూర్తి కాలేదంటూ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ప్రారంభంతో ఏపీ వాసులకు కొండంత ఊరట కలిగినట్టు అయ్యింది. 

 

కానీ ఆది లోనే హంస పాదు అన్న చందంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడం.. ఆసుపత్రి ప్రగతి పనులు ముందుకు సాగకపోవడం.. అక్కడి ప్రజలను నిరుత్సాహానికి గురిచేసింది. ఎయిమ్స్ అభివృద్ధికి వాస్తవంగా కేంద్రం నిధులు మంజూరు చేయాలి. కానీ గత ప్రభుత్వం తో కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో వ్యతిరేక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం కాస్తంత సహకరించలేదని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. ప్రస్తుత సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండడం వల్ల ఈసారి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి దండిగానే నిధులు వస్తాయని ఆశిస్తున్నారు. మరి ఇది ఏ మేరకు సఫలం అవుతుందో అని ఏపీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: