తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. 2018 ఎన్నికల్లో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే.. అయితే అంత చక్రం తిప్పిన రాజుకు కూడా ఎక్కడో ఒక చోటా మచ్చ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మచ్చనే కవితక్క ఓటమి. ఏ విషయంలోనూ సీఎం కేసీఆర్ ని అనలేని ప్రతిపక్షాలు కూడా కవితక్క ఓటమి గురించి దారుణంగా మాట్లాడుతారు.. 

 

కానీ వారి భార్యని గెలిపించుకోలేని ఉత్తముడు.. మీ అక్కనే గెలిపించుకోలేకపోయావ్ కేటీఆర్.. మా అక్కను గెలిపించుకుంటా అని బొక్క బోర్లా పడిన రేవంత్ రెడ్డి కూడా కవితక్క ఓటమిపై మాట్లాడుతారు.. ఇప్పుడు కవితక్క ఓటమి గురించి ఎందుకు అనుకుంటున్నారా? అవసరం ఉంది.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా కవితక్క ఓటమితోనే అంటూ విమర్శలు చేశారు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు చేశారు. కేసీఆర్ కుమార్తె కవితక్కను ఓడించడం ద్వారా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కు గట్టి సంకేతం పంపారని అయన సంచలన వ్యాఖ్య చేశారు. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. 

 

అంతేకాదు.. తెలంగాణాలో బీజేపీ బలం క్రమంగా పుంజుకుంటుంది అని.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని నిన్న మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే.. నిన్న మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 

 

అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే.. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఉన్న సరే.. ఖచ్చితంగా కవితక్క ఓటమి గురించి తీస్తారు.. ఇప్పటికే ఓటమి బాధతో ఉన్న కవితక్కను మాటలతో మానసికంగా కుంగతీస్తున్నారు... కరెక్ట్ గా ఓటమికి గురై సంవత్సరం అయినా.. ఇప్పటికి సరిగ్గా ప్రజల్లోకి రాలేకపోతున్నారు కవితక్క.  

మరింత సమాచారం తెలుసుకోండి: