మొన్నటికి మొన్న భారతదేశం లో అడుగుపెట్టిన కరోనా  వైరస్ తాజాగా తెలంగాణ రాష్ట్రానికి కూడా వ్యాపించి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరు  భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా జన సంచారం ఎక్కువగా ఉండే హైదరాబాద్ నగరంలో రోజురోజుకు కరోనా అనుమానాలు  పెరిగిపోతూ వస్తోన్నాయి . ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శరవేగంగా వ్యాప్తిచెంది ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవహరిస్తున్న తీరు పై స్పందించిన... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ సినీ నటి విజయశాంతి తెలంగాణ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు విజయశాంతి. 

 

 

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా  కేసులు లేవు అంటూ అసెంబ్లీ వేదికగా తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఆయన మాత్రం ప్రగతిభవన్ నుంచి తప్పించుకుని... గజ్వేల్ ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ సేద తీరుతున్నారు అంటూ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కేసిఆర్ కు ఫామ్ హౌస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి సేదతీరుతున్నారు.  మరి హైదరాబాద్లోని సామాన్యులు ఎక్కడికి వెళ్లాలి అంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ప్రశ్నించారు. ఈ విషయంలో కేసిఆరే నోరువిప్పి సమాధానం చెబితే బాగుంటుంది అంటూ తెలిపారు. 

 

 

 ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే హైదరాబాద్ నగరం వచ్చి  కరోనా  వైరస్ నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను... స్వయంగా పర్యవేక్షించాలని అంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు విజయశాంతి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాంతకమైన కరోనా వైరస్  కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అంటూ తెలిపిన విజయశాంతి... హైదరాబాద్ లోనూ ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. కరోనా  వైరస్ కేవలం హైదరాబాద్ నగరం లో మాత్రమే ఉందని రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉండదు అంటూ తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఆయన కరోనా  బారినపడకుండా ఉండేందుకు ఆయన భద్రత కోసం ఫామ్ హౌస్ కి  వెళ్ళిపోయి సేద తీరుతున్నారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్,  ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: