మ‌న‌దేశంలో క‌రోనా మ‌ర‌ణ మృందంగం ఆగ‌డం లేదు. ఇక దేశంలో ఇప్ప‌టికే క‌రోనా బాధితుల సంఖ్య 415కు చేరుకుంది. దేశంలో గంట గంట‌కు క‌రోనా బాధితులు పెరుగుతున్నారు. ఇక సోమ‌వారం అప్‌డేట్‌ను బ‌ట్టి చూస్తే దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకి చ‌నిపోయిన వారి సంఖ్య 9కు చేరుకుంది. తాజాగా కరోనా వైరస్ సోకి ముంబైలో ఫిలిప్పీన్స్ కు చెందిన 68 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ రోజు ఉద‌యం స‌ద‌రు వ్య‌క్తి మృతి చెందారు. ఇక ఇది ఎనిమిదో మ‌ర‌ణంగా న‌మోదు అయ్యింది. ఇక సోమ‌వార‌మే కోల్‌క‌త్తాకు చెందిన మ‌రో 55 ఏళ్ల వ్య‌క్తి సైతం మృతి చెందాడు.

 

ఇక స‌ద‌రు  ముంబై వ్య‌క్తికి ముందుగా క‌రోనా సోకింది.. ఆ త‌ర్వాత ఆయ‌న కోలుకున్నాడు. అయినా మృతి చెందాడు. దీనిని బ‌ట్టి కరోనా ఒక‌సారి వ‌స్తే త‌గ్గినా స‌ద‌రు వ్య‌క్తి ప్రాణానికి గ్యారెంటీ ఉండ‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక నిన్న బిహార్‌లో 38 ఏళ్ల యువ‌కుడు సైతం మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. దీనిని బ‌ట్టి క‌రోనాకు యువ‌కులు. వృద్ధులు. మ‌హిళ‌లు అన్న తేడా ఉండ‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక దేశ‌వ్యాప్తంగా చూస్తుంటే క‌రోనా ఓరుగా విజృంభిస్తోంది.

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమ‌వారం ఒక్క రోజునే తెలంగాణ‌లో ఏకంగా ఆరుగురు వ్య‌క్తుల‌కు కొత్త‌గా వైర‌స్ సోకింది. దీంతో అక్క‌డ వైర‌స్ సోకిన వారి సంఖ్య 33కు చేరుకుంది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రింత స్ట్రిక్ట్‌గా రూల్స్  అమ‌లు చేస్తోంది. తాజాగా ఈ  నెల 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ కూడా ప్ర‌క‌టించారు. ఇక ఇప్పుడు సాయంత్రం 7 త‌ర్వాత ఆసుప‌త్రులు, మెడిక‌ల్ షాపులు త‌ప్ప ఏం ఉండ‌కూడ‌ద‌ని క‌ఠినంగా నిబంధ‌న‌లు విధించారు. మ‌రి ఇప్పుడు ఈ మ‌హమ్మారి నుంచి భార‌త దేశం ఎలా బ‌య‌ట ప‌డుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: