దేశంలో కరోనా కేసుల సంఖ్య 9,000 దాటింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం 20 రోజుల క్రితం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను పొడిగించనున్నట్టు ప్రకటన చేసింది. లాక్ డౌన్ వల్ల సామాన్యులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కుడా లాక్ డౌన్ కష్టాలు తప్పలేదు. 
 
కిషన్ రెడ్డి తన తల్లి ఆండాలమ్మ ప్రథమ వర్ధంతిని ఈరోజు రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో చేయాల్సి ఉంది. మంత్రి ఢిల్లీలోనే ఉండడంతో లాక్ డౌన్ వల్ల స్వగ్రామానికి రాలేకపోయారు. కిషన్ రెడ్డి  తిమ్మాపూర్ లో శాస్త్రోక్తంగా వర్ధంతిని నిర్వహించగా కిషన్ రెడ్డి భార్య, బంధువులు ఆన్ లైన్ లో వీడియో ద్వారా కార్యక్రమాన్ని తిలకించారు. కరోనా సహాయక చర్యల సమీక్షలు, ఇతరత్రా వ్యవహారాల్లో గత నెల రోజుల నుంచి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. 
 
కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో " మా అమ్మగారు శ్రీమతి ఆండాళమ్మ గారి మొదటి పుణ్యతిథి సందర్భంగా, ఢిల్లీ నివాసంలో శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మలు నిర్వహించాను. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దేశానికి మరింత సేవ చేసేందుకు, శక్తి,యుక్తులను ఇవ్వాలని, మా అమ్మ గారిని ప్రార్ధించాను" అని ట్వీట్ చేశారు. నేటికి కిషన్ రెడ్డి తల్లి మరణించి ఏడాది పూర్తయింది. 
 
తాను హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నానని... లాక్ డౌన్ నిబంధనలను తాను ఉల్లంఘించాలని అనుకోవడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: