కరోనా నేపథ్యం లో లాక్ డౌన్ అమలువుతున్న నేపథ్యంలో సెలూన్ షాప్ లు కూడా మూత పడ్డ విషయం తెలిసిందే. అయితే  ఈనెల 20 వ తరువాత కేరళ లో సెలూన్ షాపులు తెరుచుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది. కేవలం శని , ఆదివారాల్లో మాత్రామే సెలూన్లు తెరవాలని ప్రతి సెలూన్ దగ్గర సామజిక దూరం పాటించేలా చూస్తూ , హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలని నిర్వాహులకు ఆదేశాలు జారీచేసింది. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా షాపులు ఓపెన్ చేస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక కేవలం సెలూన్ల కు మాత్రమే పర్మిషన్ ఇవ్వగా బ్యూటీ పార్లర్లు మరి కొద్దీ రోజులు మూత పడనున్నాయి. 
 
ఇదిలావుంటే కేరళలో మొన్నకేవలం ఒకే ఒక్క కరోనా కేసు నమోదు కాగా నిన్న మాత్రం 7 కేసులు నమోదయ్యాయని సీఎం విజయన్ ప్రకటించారు. ఇందులో 5గురు విదేశీయలు వున్నారు. ఇక ఇప్పటివరకు కేరళ లో మొత్తం కేసుల సంఖ్య 394 కు చేరింది. అందులో 245 మంది కోలుకోగా ఇద్దరు మరణించారు. ప్రస్తుతం 147 కేసులు యాక్టీవ్ లో వున్నాయి. ఓవరాల్ గా ఇండియాలో ఇప్పటివరకు 12500కు పైగా కరోనా కేసులు నమోదు కాగా  400కు పైగా మరణాలు సంభవించాయి. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: