కరోనా వైరస్ దేశాలను ప్రపంచాలను వణికిస్తుంది. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషులు చాలా మంది చనిపోతున్నారు. ముఖ్యంగా యూరప్ మరియు అమెరికా దేశాలలో ఈ వైరస్ ప్రమాదకరంగా ఉండటం తో వేల సంఖ్య లో మరణాలు సంభవిస్తుంటే లక్షలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలో కూడా పరిస్థితి రోజు రోజుకి పాజిటివ్ కేసులు వందల్లో నమోదవుతున్నాయి. దీంతో లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయడంతో దేవుళ్ళ మీద కూడా లాక్ డౌన్ ప్రభావం గట్టిగా పడుతోంది.

 

లాక్ డౌన్ వాళ్ళ తిరుమల శ్రీవారి ఆలయం, మక్కా మసీద్, వాటికన్ సిటీ ఇలా ప్రముఖ ప్రార్ధన మందిరాలన్నీ మూతపడ్డాయి. మన దేశంలోనే అత్యంత పుణ్యక్షేత్రం తిరుమలకు ప్రతి రోజు లక్షలలో భక్తులు వచ్చి కిటకిటలాడుతూ నిత్యం హోమం మరియు నైవేద్యాలతో భక్తుల భక్తిని అందిపుచ్చుకునే టీటీడీ నెలరోజులుగా మూసివేయడంతో వందల కోట్లల్లో నష్టం వచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి. టీటీడీ లో హుండీ ఆదాయంతో పాటు టికెట్లు, వసతి గదులు, ప్రసాదం, తలనీలాలు, హోటళ్లు, దుఖాణాలు ఇలా తదితర రూపాలలో వచ్చే ఆద్యం మొత్తం కోల్పోవడం జరిగింది.

 

దీనితో దాదాపుగా 300 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందట. ఒక్క హుండీ ద్వారానే వంద కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోయారు. మే 3 వరకు పరిస్థితి ఇదే కావడంతో మరింత నష్టం భవిష్యత్తులో రాబోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతో టీటీడీ బోర్డు స్వామివారి లడ్డూ ప్రసాదం లో ఇంకా కొన్ని విషయాల్లో రేట్లు పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్షిక ఆదాయం లో మార్పిడి చేసే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: