విశాఖలో ఈ వేకువ జామున ఎల్జీ పాలిమర్స్ అనే పరిశ్రమ నుంచి లీకైన విషవాయువు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఘటనపై సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయచర్యలు ముమ్మరం చేశాయి. విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. విశాఖ కేజీహెచ్‌లో 187 మందికి చికిత్స అందిస్తున్నారు. అపోలోలో 48, విశాఖ సెవెన్ హిల్స్‌లో 12 మందికి, ఇతర ఆసుపత్రుల్లో మిగతావారికి చికిత్స అందిస్తున్నారు. ఆర్‌ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు బస, ఆహారం ఏర్పాటు చేశారు. గ్యాస్‌ లీక్ వల్ల 22 పశువులు, 6 కుక్కలు మృతి చెందాయని అధికారులు ప్రకటించారు. వైజాగ్ నగరంలో తీవ్ర విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదైంది.

 

వేకువ జామున ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి లీకైన విషవాయువు తీవ్ర ప్రభావం చూపింది. వెయ్యి మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనతో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.  ఈ ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ వివరాలు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టిరీన్ గ్యాస్ లీకైన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 11కి పెరిగిందని వెల్లడించారు. ఈ విషవాయువు ప్రభావానికి గురైన 200 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని, 80 మందికి పైగా వెంటిలేటర్లపై ఉన్నారని ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు.

 

సహాయక చర్యల్లో భాగంగా 500 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు.  ఇక వైద్య సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని అడిగారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. కాగా, ‘కరోనా’ నేపథ్యంలో జగన్ మాస్క్ ధరించారు. జగన్ వెంట డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: