కరోనా వైరస్ దెబ్బకి చాలావరకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందులేని ఈ వైరస్ వల్ల చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేయటంతో ఆర్థిక మాంద్యం చాలా దేశాల్లో ఏర్పడింది. లాక్ డౌన్ వలన కంపెనీలు మూసేయడంతో రాబడి లేకపోవడంతో ఉద్యోగస్తులు అంత ఇంటికే పరిమితం కావడంతో మెల్లమెల్లగా కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగస్తులను ఎరి వేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు ఒకపక్క ఉద్యోగస్తులను ఉద్యోగాల నుండి తొలగించకూడదు, అలా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి అని చెబుతున్న గాని… ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోనే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

 

అంతేకాకుండా ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం సరైన జీతాలు ఇవ్వకుండా కోతలు విధిస్తున్న తరుణంలో జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారు. చాలావరకు కరోనా వైరస్ కారణంగా జర్నలిస్టులు తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జర్నలిజం లో భాగా సంపాదించిన జర్నలిస్టులు డిజిటల్ మీడియా లోకి అడుగుపెట్టి సంపాదించుకున్న క్రేజ్ ని, పేరుని బేస్ చేసుకుని యూట్యూబ్ లో ఛానల్ గాని, ఫేస్బుక్ లో పేజ్ గాని క్రియేట్ చేసి డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉద్యోగాలు కోల్పోతున్న చాలా మంది జర్నలిస్టులు తమకున్న నైపుణ్యాన్ని డిజిటల్ మీడియా రంగంలో చూపెడుతూ తమ బతుకులు కొనసాగిస్తున్నారు.

 

కొంతమంది జర్నలిస్ట్స్ తమ రాజకీయ నైపుణ్యం ఆర్టికల్స్ రూపం లోను వెబ్ మీడియాలో పొందుపరుస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మరికొంతమంది ప్రూఫ్ రీడింగ్ ద్వారా కూడా ఏదో విధంగా సంపాదిస్తున్నారు. మరోపక్క పత్రికా రంగం పై కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో పడింది. చాలా వరకు పత్రికలు మూతలు పడిపోయాయి. జర్నలిస్టులు చాలామంది అర్ధాంతరంగా తమ ఉద్యోగాలు కోల్పోవడంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తంమీద ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో జాబ్ లు కోల్పోతున్న జర్నలిస్టులు వెబ్ మీడియాలో తమ టాలెంట్ ద్వారా బాగానే రాణిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: