కరోనా వైరస్ పరీక్షలకు ప్రభుత్వాలు ఒక టెస్టు కోసం కనీసం 4500 రూపాయల వరకూ ఖర్చు పెడుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి చాలా వరకు నష్టం వాటిల్లుతుంది. పైగా రిజల్ట్ రావటానికి 24 గంటల వరకు సమయం తీసుకుంటుంది. ఈ లోగా ఆ రోగి వల్ల వైరస్ ఎంతమందికి సోకుతుందో అర్ధం కానీ పరిస్థితి. ఇలాంటి సమయంలో అంత ఖర్చు లేకుండా చాలా తక్కువ టైంలోనే కరోనా వైరస్ టెస్ట్ ₹500 లోనే.. గంటలో రిజల్ట్ వచ్చే విధంగా సరికొత్త కిట్ అందుబాటులోకి వచ్చింది. ఈ  అధునాత నూతన పరికరాన్ని తయారు చేసింది పశ్చిమబెంగాల్లోని జీసీసీ బ‌యోటెక్ ఇండియా. ఈ కంపెనీ క‌రోనా టెస్టుల‌ను త‌క్కువ ఖర్చుతోనే చేసేలా.. టెస్టుల ఫ‌లితాలు వేగంగా వ‌చ్చేలా ఓ నూత‌న ప‌రిక‌రాన్ని త‌యారు చేసింది. దీంతో రూ.500కే క‌రోనా టెస్టు చేసే అవకాశం లభించింది.

 

కేవలం 90 నిమిషాల్లోనే టెస్టు రిజల్ట్ వ‌స్తుంది. దీంతో ఒకేసారి పెద్ద ఎత్తున క‌రోనా టెస్టులు చేసేందుకు వీలు క‌లుగుతంది. ఈ పరికరాన్ని రియ‌ల్ టైం క‌రోనా టెస్టింగ్ కిట్ అని పిలుస్తున్నారు. దీంతో ఒక వ్య‌క్తికి 90 నిమిషాల్లోనే క‌రోనా ఉందీ, లేనిదీ తెలిసిపోతుంది. అలాగే టెస్టుకు కేవ‌లం రూ.500 మాత్ర‌మే ఖర్చవుతున్న నేపధ్యం లో చాలా ప్రభుత్వాలు పరీక్షలు చేసుకోవచ్చని కంపెనీ అంటుంది.  ఈ సంద‌ర్భంగా ఆ కంపెనీ ఎండీ ఆర్ మ‌జుందార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్ప‌టికే ఈ టెస్టు కిట్లు 1 కోటి వ‌ర‌కు త‌యారు చేశామ‌ని తెలిపారు.

 

దీంతో ఎంతో డ‌బ్బు, స‌మ‌యం ఆదా అవుతాయ‌ని తెలిపారు. అలాగే క‌రోనా వ్యాప్తిని కూడా నియంత్రించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఈ విధంగా గంటల్లోనే కరోనా వైరస్ అనుమానితుల పరీక్షలు చేయటం వల్ల చాలా వరకు వైరస్ నియంత్రించిన వాళ్లమవుతాం అని అంటున్నారు. ఈ పరికరాలు త్వరలోనే భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా కంపెనీ యాజమాన్యం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: