ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా విదేశాల్లో భారత దేశానికి చెందిన ఎంతో మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఎక్కడ విదేశీ విమానయాన సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో స్వదేశానికి వచ్చే అవకాశంలేకుండా పోయింది విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వందే భారత్ మిషన్ చేయబడుతుంది కేంద్ర ప్రభుత్వం. వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను.. స్వదేశానికి రప్పించేందుకు ముమ్మర ప్రక్రియలను చేపడుతుంది. 

 

 ముఖ్యంగా సముద్ర మార్గం గుండా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత నౌకాదళం ముమ్మర  చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సముద్ర సేతు చేపట్టి... విదేశాలలోని ఇరుక్కుపోయిన వేలసంఖ్యలో భారతీయులను స్వదేశాలకు తరలిస్తుంది. ఇప్పటికీ మాల్దీవుల్లో 1500 మందికి పైగా భారతీయులను  ఐఎన్ఎస్  జలస్వా  స్వదేశానికి చేర్చింది. అటు శ్రీలంకలో కూడా ఎక్కువ మొత్తంలో భారతీయులు చిక్కుకున్నట్లు గ్రహించిన భారత నౌకాదళం... వారిని తీసుకురావడానికి మరోసారి ఐఎన్ఎస్  జలస్వా  ను సిద్ధం చేశారు. 

 

 దాదాపుగా ఈరోజు సాయంత్రం వరకు 700 మంది విదేశాల్లో చిక్కుకున్న భారతీయులతో కొలంబో నుంచి తమిళనాడులోని ట్యుటికోరిన్ కు నౌకా  బయలుదేరినట్లు తాజాగా నౌకాదళ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే విదేశాల లో చిక్కుకున్న భారతీయులకు ముందుగా పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వారిని నౌకలోకి  ఎక్కేందుకు అనుమతించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మరోసారి స్వదేశానికి చేరిన తర్వాత కూడా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.ఇంతే కాకుండా వివిధ దేశాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కీలక  చర్యలు చేపడుతోంది. వందే భారత్ మిషన్ లో భాగంగా అటు విమానాల ద్వారా ఇటు సముద్రమార్గం గుండా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: