చైనా భారత్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఇప్పటికే కరోనా ధాటికి చైనా, భారత్ ఆర్థికంగా కుదేలయ్యాయి. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనా, భారత్ దేశాలు భారీగా సైన్యాలను మోహరించాయి. ఈరోజు ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల సమావేశం జరగనుండటంతో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారో లేదో తేలనుంది. 
 
భారత్ ఇప్పటికే చైనాపై పైచేయి సాధించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. భారత్ ముందస్తు చర్యల్లో భాగంగా 60 బోఫోర్స్ శతఘ్నల్ని వాస్తవ నియంత్రణ రేఖ దగ్గరకు తరలించింది. ఈరోజు జరగబోయే చర్చల్లో భారత్ సింగిల్ లైన్ అజెండాతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాలని..... బలగాలను వెనక్కు మళ్లించాలని భారత్ నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. 
 
ఆర్మీ మాజీ అధికారులు చైనా గ్వాదర్ పోర్టు, వన్ బెల్ట్ వన్ రోడ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల విషయంలో కొన్ని సడలింపులు కోరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అన్ని విధాలుగా చైనాను డిఫెన్స్ లో పడేసేలా భారత్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారత భూభాగంలోని 50 కిలోమీటర్లను చైనా ఆక్రమించినట్టు వార్తలు వస్తున్నాయి. చైనా భారత్ సరిహద్దు వివాదం ఈరోజు పరిష్కారమవుతుందో లేదో చూడాల్సి ఉంది. 
 
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా మహమ్మారి వల్ల అమెరికా తీవ్రంగా ప్రభావితమైందని అన్నారు. చైనా ఇచ్చిన చెడ్డ బహుమతి కరోనా అంటూ వ్యాఖ్యలు చేశారు. చైనా వైరస్ ను ప్రారంభంలోనే ఆపి ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి చైనా ఎన్నో లాభాలను పొందిందని వ్యాఖ్యలు చేశారు.కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఆశాజనకమైన ఫలితాలు వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: