ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడ అవినీతి జరగకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమాలను అరికట్టే  విధంగా కొత్త ఇసుక పాలసీ ని తీసుకొచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎక్కడ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్ . కానీ ప్రాక్టికల్గా మాత్రం జగన్ సర్కార్ లక్ష్యం కాస్త నీరు గారి పోతుంది. వాస్తవంగా అయితే డంపింగ్ యార్డ్ లో ఇసుక వేస్తూ ఉంటారు ఇక్కడ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్తే ఇసుక కొనుక్కొని వచ్చే విధంగా అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఇసుక పాలసీ ప్రకారం.. డంపింగ్ యార్డుకు వెళ్లే బదులు ఆన్లైన్ ద్వారానే కొనుక్కునే విధంగా పాలసీ తీసుకొచ్చారు. 

 


 ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కార్  తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ విషయంలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. అవసరమైన వారికి తగిన మేర ఇసుక దొరకకపోవడంతో నిర్మాణ రంగం తీవ్ర స్థాయిలో కుదేలు  అవుతుంది అని అంటున్నారు. ఇక ఇప్పటికే కొంతమంది నేతలు కూడా ఇసుక పాలసీ పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ప్రభుత్వం దీనిపై పునరాలోచించి  తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎడ్ల బండ్ల  లో  వెళితే ఫ్రీగా ఇసుక తెచ్చుకోవచ్చు అనే కీలక నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇది పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. 

 


 అయితే ఈ ఎడ్ల బండ్ల లో ఇసుక  నిర్ణయం కారణంగా కొంతమంది కలెక్షన్ కింగ్ లు  తయారవుతారు అని అంటున్నారు విశ్లేషకులు. ఇసుకను తీసుకెళ్లే క్రమంలో ఎడ్ల బండి కి ఇంత  మొత్తం చెల్లించాల్సి ఉంటుంది అంటు అడిగేవారు ఉంటారని... అలా  అడిగినప్పుడు  వారిని వెంటనే తీసుకెళ్ళి జైలు లో వేసే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఎడ్ల బండ్ల కి డిమాండ్  పెరిగి రైతు కూలీలకు కూడా ఉపాధి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. మరోపక్క ఇసుక గ్రామీణ  ప్రాంతాల్లోకి చేరే  అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: