అలాగే కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలోనూ, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న తీరు అభినందనీయం అంటూ పవన్ ప్రశంసించే సరికి వైసీపీ లో ఎక్కడలేని ఆనందం కనిపిస్తుంది. 1088 నూతన 108 ,104 వాహనాలను ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా జగన్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. జాతీయ మీడియాలో ఈ విషయం హైలెట్ అయ్యింది. పార్టీలకతీతంగా జగన్ తీరు జాతీయస్థాయిలో అందరూ ప్రశంసించారు. జాతీయ స్థాయిలో జగన్ కు ఈ స్థాయిలో పొగడ్తలు వస్తున్న సందర్భంగా, సొంత రాష్ట్రంలో ఆయనను ప్రశంసించకపోతే ప్రజల్లోనూ, తమపై చులకన భావం ఏర్పడుతుంది అనుకున్నారో, ఏమో కానీ, మొదటిసారిగా జగన్ తీరును ప్రశంసించారు.
ఆం. ప్ర గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో
— pawan Kalyan (@PawanKalyan) July 3, 2020
ఆరంభించడం - అభినందనీయం ..
అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు - అభినందనీయం..
ఇది ఇలా ఉంటే పవన్ ట్వీట్లు చేయడం తో ఆనందంలో ఉన్న వైసీపీ శ్రేణులు పవన్ ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్ లను తీసి తమ ఫేస్బుక్, వాట్సప్ గ్రూపులలో పోస్ట్ చేస్తూ, పవన్ ప్రశంసిస్తూ పోస్ట్ పెడుతున్నారు. చూశారా తమ నాయకుడిని పవన్ కూడా పొగిడేశారు. మొన్న చిరంజీవి, నిన్న నాగబాబు, ఇప్పుడు పవన్ మొత్తానికి తమ నాయకుడి గొప్పతనం ఒప్పేసుకున్నారు అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపైన జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. పవన్ ను వైసీపీ ఇలా వాడుకోవడంతో వారిని అభినందించాలో, విమర్శించాలో తెలియక సతమతమైపోతున్నారు.ఏది ఏమైనా వైసీపీ శ్రేణులు పవన్ టిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాయి.