గత ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీ తో ఓడిపోయింది. ఇలాంటి దుస్థితి టీడీపీ పార్టీని పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ జరగలేదని రాజకీయ వర్గాల్లో వినపడింది.అయితే ఈ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ ఓటమి తో తీవ్రంగా అవమాన పాలు అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లో 151 స్థానాల్లో వైసీపీ విజయాన్ని అందుకుంది. ఎన్నికల ముందు ఎగిరి పడిన చంద్ర బాబు ఈ ఓటమి తో దుకాన్ సర్దేసాడు.



వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకుంది.. కొత్త పాలనకు శ్రీకారం చుట్టింది. అయితే టీడీపీ బుద్దిని మాత్రం పోనివ్వలేదు.. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రయత్నిస్తుంటే టీడీపీ మాత్రం వాటిపై బురద చల్లుకుంటూ వస్తుంది. ఈ విషయం వైకాపా నేతలు, ప్రజలు టీడీపీ కి బుద్ది చెప్తూ వస్తున్నారు. ఇటీవల చాలా సార్లు టీడీపీ నేతలు , కార్యకర్తలు వైకాపా నేతల ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యంగా టీడీపీ నేత లోకేష్ బాబు మాత్రం ఘోరంగా చివాట్లు తిన్నారు.  



మరో విషయమేంటంటే.. టీడీపీ అధినేత చంద్ర బాబు ఈ మధ్య సైలెంట్ గా ఉన్నాడు. అందుకు కారణం ఏంటని అర్థం కాలేదు. జగన్ పై డ్యూడిషినల్ లేఖ పై మాత్రమే ఆయన గొంతు లేచింది. ప్రస్తుతం ఆయన సైలెంట్ అయ్యారు. డ్యూడిషినల్ కు మూల కారకులు చంద్రబాబు అయితే అతను నిశబ్దాన్ని పాటిస్తున్నారు. ఇకపోతే ఓటుకు నోటు కేసులో టీడీపీ అధికారులు అనేక పరిణామాలను ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారం చాలా మంది నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వీడియో లతో సహా బయట పడిన కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. దీని పై విచారణ జరిపించాలని రాజకీయ ప్రముఖులు కోరితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది అంటూ జారుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే చూద్దాం అన్నట్లు వ్యవహరించింది. ఇలాంటివన్నీ మళ్లీ బయటపడకుండా ఉండాలంటే టీడీపీ ప్రస్తుతం సైలెంట్ అయితేనే బెటర్ అని అనుకుంటున్నారు. ఈ సైలెంట్ ఎవరికీ వైలెంట్ గా మారుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: