ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ఎప్పుడూ సీఎం జగన్ పరిపాలన మీద చాలా వరకు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. కొంతమందికి అనుకున్న విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందకపోవడంతో ఇప్పుడు సీఎం జగన్ కూడా కాస్త దాని మీద దృష్టి పెట్టినట్టు గా సమాచారం. ఈ నేపథ్యంలోనే కొంతమందికి సంక్షేమ కార్యక్రమాలను అందించే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు అందటం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.

తెలుగుదేశం ప్రభుత్వంలో వారికి నిరుద్యోగ భృతి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం నిరుద్యోగ భృతి విషయంలో వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు ఏకంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టే విధంగా సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలలో నిరుద్యోగులను కూడా భాగం చేసే విధంగా సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత నుంచి సంక్షేమ కార్యక్రమాలను వారికి కూడా అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన ఎవరైనా సరే ఉద్యోగం రాకపోతే వారికి ఖచ్చితంగా నిరుద్యోగ భృతి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఈ విషయంలో సీఎం జగన్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసే కమిటీ ద్వారా ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగుల అభిప్రాయం కూడా అందు కోసం  తీసుకునే అవకాశం ఉంది. సీఎం జగన్ ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్లనున్నారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: