ఏపీ ప్రభుత్యం, వరద పరిస్తుతుల్లో పూర్తిగా చేతులు ఎత్తేసింది అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఎవ్వరు వారి వారి ప్రాంతాల్లో పర్యటించిన దాఖలాలు లేవు అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్యం రాష్ట్రాన్ని ఆదుకుంటాము అని చెప్పిన తరువాతే ముఖ్యమంత్రి జగన్ మేల్కొన్నారు అని అన్నారు. పబ్లిసిటీ కే ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రభుత్యం అని మండిపడ్డారు. భారీ వర్షాలు కురుస్తాయాని ముందస్తుగా వాతావరణ శాఖ చెప్పినా సరే చర్యలు తీసుకున్నది శూన్యం అన్నారు.

ప్రజల కష్టాలు గాలికి వదిలేసి వైసీపీ ప్రభుత్యం వేరే పనిలో ఉంది అని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రభుత్యం మాత్రం అప్పులు ఎక్కడ పుడుతాయో వెతుకులటలో ఉంది అని అన్నారు. తిరుమల బాండ్లు పై వివాదం చెలరేగితే....ఉపసంహరించుకుందని అన్నారు. ప్రతిపక్షం లో ఉన్నపుడు గుడులు కూల్చితే ఆందోళన చేసిన మీరు ఇప్పుడు 17 నెలల కాలం లో ఎన్ని గుడులు కట్టారో చెప్పాలి అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో చర్చిలు నిర్మాణానికి ఖర్చుచేస్తుంది ప్రభుత్వం మండిపడ్డారు. హిందూ దేవాలయ నిధులను ఇష్టం వచ్చినట్టు తరలిస్తున్నారు అని అన్నారు.

 వైఎస్ జగన్ హిందూ దేవాలయాల నిధులను ఇతర మతాల కోసం వాడుతున్నారని అన్నారు. బిజెపి చర్చులు, మసీదు కట్టడాలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేసారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ప్రవర్తిస్తున్న తీరుకు వ్యతిరేకం అని అన్నారు. కులాల,మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుందని విమర్శించారు. భారత రాజ్యాంగం తెచ్చిన ఈబిసి రిజర్వేషన్లు అమలుచేయని చేతకాని ప్రభుత్యం వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు.

రాజకియ కక్షసాధింపు తప్ప ఈ ప్రభుత్యానికి ఏమి చేతకాదు అని అన్నారు. వైసీపీ ఒక లిమిటెడ్ కంపెనీ అని, సొంతపార్టీ వారు తప్పు చేస్తే కేసులు ఎత్తేసారు....ఇతర పార్టీవారిని అరెస్ట్ చేసారు అని మండిపడ్డారు. దున్నపోతుమీద వర్షం కురిసింది చందంగా కోర్టులు ఎన్ని చివాట్లు పెట్టిన జగన్ సర్కార్ కు మార్పులేదని, దేశ చరిత్రలో ఏ రాష్ట్రప్రభుత్వానికి ఇన్ని మొట్టికాయలు పడ్డ రికార్డ్ లేదు అని అన్నారు. కోర్ట్ మొట్టికాయలు విషయంలో వైసీపీ ప్రభుత్యం గిన్నిస్ బుక్ లోకి ఎక్కడానికి అర్హత ఉందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: