దుబ్బాక ఉప ఎన్నికలకు ఇక వారం అంటే వారం రోజులే వున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడిక్కిపోతోంది. నిన్న సోమవారం సిద్ధిపేటలో.. బీజేపీ అభ్యర్థి అయినటివంటి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసులు సోదాలు చేసి డబ్బులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా.. సిద్ధిపేటలో పోలీసుల సోదాలతో పరిస్థితి మరింత భయంకరంగా మారింది.  

అయితే, ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నేతలంతా ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత అయినటువంటి బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రఘునందన్ మీద కేసీఆర్ కుటిల రాజకీయం చేస్తున్నారు. మామా అల్లుళ్ళ పప్పులు ఉడకవు. ప్రధాని నరేంద్ర మోదీ కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైల్లో వుంటారు... జాగ్రత్త అని బాబు మోహన్ హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో కనీస వసతులు లేవని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు నియోజకవర్గాలు అయినటువంటి గజ్వేల్, సిద్దిపేట ఏ రకంగా ఉన్నాయి? దుబ్బాక ఏ రీతిలో ఉంది? అంటూ బాబు మోహన్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట తీవ్ర స్థాయిలో ఆందోళన జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఇకపోతే, పోలీసులు అతనిపట్ల వ్యవహరించిన తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ దీక్షకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ నేత డీకే అరుణ బండి సంజయ్‌ను కలిసి దీక్షకు మద్దతు తెలిపారు. ఈ విషయమై అభ్యర్థి రఘునందన్ రావుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి జరిగిన ఘటనపై ఆరా తీశారు. మరో వైపు బీజేపీ నేతల కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రగతి భవన్, డీజీపీ కార్యాలయాన్ని ముట్టడి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: