చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి చాలా రోజులైపోయాయి.. వచ్చినా ఏవో సొంత పనులు చూసుకుని వెళ్లిపోయారు..పవన్ కళ్యాణ్ అంటే సినిమాలు చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రనికి వచ్చే టైం లేదు అనుకోవచ్చు కానీ చంద్రబాబు కు ఏమైంది అని అంటున్నారు ప్రజలు.. కరోనా సమయంలో ప్రజలను కాపాడాల్సింది పోయి భయపడి దాక్కోవడమేంటి అని ప్రశ్నిస్తున్నారు.. గతంలో ఎలాంటి రాజకీయ నీతి లేకుండా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు దెయ్యం వేదాలు వల్లించినట్లు మాట్లాడడమే కాకుండా ప్రజలకు చూసుకోవాలన్న కనీస జ్ఞానం లేకుండా పోయింది అని విమర్శిస్తున్నారు..

ఇంత చెప్తున్నా చంద్రబాబు పాత పద్ధతిలోనే జగన్ ను విమర్శిస్తూ రాజకీయం చేయడం రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యం గా ఉంది. నాయకులు అన్న తరువాత పార్టీ మారిపోవడం ఖాయం.. అయితే ఇప్పుడు ఇది ఎక్కువయిపోవడం తో అందరు ఆందోళన చెందుతున్నారు.. గతంలో నేతలు పార్టీ మారి అధికారంలో కి వచ్చే వారు.. కానీ ఇప్పుడు ఒక పార్టీ లో గెలిచి ఆ పార్టీ అధికారంలో లేకుంటే అధికారంలో ఉన్న వేరే పార్టీ కి వెళ్లి తమ పబ్బం గడుపుకుంటున్నారు. నాయకులు ఏ పార్టీ లోకి వెళ్లినా మొదటినుంచి పార్టీ బరువు బాధ్యతలు మోసేది కార్యకర్తేల.. వీరి ని పట్టించుకునే వారు లేరు..

ఇదిలా ఉంటె తెలంగాణాలో ఉంటూ చంద్రబాబు , పవన్ లు టూరిస్ట్ లు లాగ ప్రజలకు మింగుడు పాడడం లేదు..  సీమకు తాగు, సాగు నీళ్ళు ఇవ్వాలని జగన్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం మొదలుపెడితే దానిని తెలంగాణా సర్కార్ అడ్డుకుంటోంది. అది వివాదం కూడా అయి అపెక్స్ కమిటీ దాకా కధ నడిచింది కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు కానీ పవన్ కానీ కనీసం స్పందించకుండా మౌనం దాల్చారని విమర్శలు ఉన్నాయి. తెలంగాణ లో ఉంటూ కేసీఆర్ పై ఒత్తిడి చేయకుండా ఉండడం వారికి రాజకీయానికి అడ్డం పడుతుంది.. ఏపీ ప్రజల ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి ఒక్కటిగా ఉండాల్సిన ఇద్దరు నేతలూ ఎందుకు సైలెంట్ అయ్యారో వారికే తెలియాలి. . 

మరింత సమాచారం తెలుసుకోండి: