ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఆరోగ్య శాఖ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. వైద్యులు కూడా ఇప్పుడు కరోనా తీవ్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. వచ్చేది చలికాలం కావడం కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడం అదేవిధంగా చలితీవ్రతతో ఇతర వ్యాధుల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు కూడా అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.

దీనితో ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ అప్రమత్తం కావాలని అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఒక క్యాబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో కరోనా తీవ్రతకు సంబంధించి కొంత మంది మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అంతేకాకుండా ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. కరోనా తీవ్రత ఇంకా పెరిగితే రాష్ట్రంలో లాక్ డౌన్ అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనితో సీఎం జగన్ ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

తీవ్రతను కట్టడి చేయడానికి పరీక్షల సంఖ్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచే ఆలోచనలో ఉంది అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కరోనా పరీక్షలు ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలో నే పరీక్షల సంఖ్యను మరింతగా పెంచే దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక సమీక్ష సమావేశం కూడా సీఎం జగన్ నిర్వహించనున్నారు. పరీక్షలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకునే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వ్యాక్సిన్ విషయంలో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఎవరికి ఇవ్వాలి అనే దానిపై ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: