ఆడపిల్ల జీవితం రోజురోజుకు నేటి రోజుల్లో ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆడపిల్లలకు రక్షణ కల్పించలేక పోతున్నాయి కామంతో కళ్లు మూసుకుపోతున్న మనషులు  ఏదో ఒక విధంగా ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతూన్న  దారుణ ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి ఏకంగా ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉన్న ఓ యువకుడు సోషల్ మీడియాలో అమ్మాయిలకు ఎర వేయడం మొదలుపెట్టాడు ఈ క్రమంలోనే కోల్కతాలోని గోవిందపూర్ కాలనీలో ఉంటున్న ఓ బాలిక తో పరిచయం పెంచుకున్నాడు.



 సదరు బాలికను మాయమాటలతో ఆకర్షించారు. ఇక ఆ తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.. ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు కొన్ని రోజుల క్రితం నాలుగు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పు తీర్చాలి అంటూ అడిగిన బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డబ్బులు ఇవ్వాలని ఎంత అడిగినప్పటికీ సదరు యువకుడు మొహం చాటేయడంతో ఓ సారి గట్టిగా నిలదీసింది.



ఈ క్రమంలోనే అప్పు తీరుస్తాను ఇంటికి రావాలి అంటూ సదరు బాలికను ఇంటికి పిలిపించాడు యువకుడు. ఇక బాలిక ఇంటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదే అదనుగా భావించిన నిందితుడు  బాధితురాలిని లొంగదీసుకుని రేప్ చేశాడు. అంతేకాదు ఈ ఘటన గురించి ఎవరికైనా బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయినప్పటికీ ధైర్యం చేసిన బాధితురాలు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని నంటూ గా గుర్తించి అతడిని అదుపు లోకి తీసుకొని కటకటాల వెనక్కి తోశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: