భారతదేశంలో రాజకీయాలను పురుడు పోసుకున్న పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడెలా తయారైందో అందరికి తెలిసిందే..ఇప్పటికే పార్టీ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు స్పష్టం గా తెలిశాయి.. పార్టీ లోని సీనియర్ నేతలకు, కొత్త తరం నేతలకు అస్సలు పడడం లేదని అర్థమవుతుంది.. రాష్ట్ర స్థాయిలోనే అనుకుంటే కేంద్ర స్థాయిలోనూ పార్టీ నేతలమధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇదిలా ఉంటె ఏపీ లో మళ్ళీ పాగా వేయడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది.. ఇప్పటికే గత రెండు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు.. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికైనా కొంతైనా బలపడాలని చూస్తున్నారు..

అయితే తెలంగాణ ను విడగొట్టిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ముఖ్యంగా సీఎం జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఆయనను అన్ని పార్టీ లు ఎంత ఇబ్బంది పెట్టాయో అందరికి తెలుసు..ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులూ జగన్ ను జైలు కి పంపించి తండ్రి చనిపోయాడని జాలి కూడా లేకుండా మానసిక క్షోభ ను గురిచేశారు.. సోనియా గాంధీ అప్పటి కాంగ్రెస్ నాయకుల మాట విని ఈగోతో జగన్ ను ఇబ్బందిపెట్టింది.. అధ:పాతళంలోకి పోతున్న కాంగ్రెస్ పార్టీ ని బ్రతికించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేలా చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొహం చూసి కూడా సోనియా మనసు కరగలేదు.. ఇది ప్రజల మనసులో బాగా నాటుకుపోయింది..

అయితే కొంతమంది మాజీ నేతలు కాంగ్రెస్ లో చేరడం పార్టీ వర్గాల్లో కొత్త జోష్ ని నింపుతుంది. మాజీ ఎంపీ హర్షకుమార్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరడం ఆపార్టీకి కొంత ఊరటగానే చెప్పాలి. తదుపరి మరింత మంది నేతలు మళ్లీ కాంగ్రెస్ గుమ్మం ఎక్కేందుకు ఇది నాంది అవుతుందని కొందరు సీనియర్ కాంగ్రెస్ వాదులు ఆశిస్తున్నారు. కానీ రాజకీయ సమీకరణాల్లో మార్పులు రాకుండా అది అంత సులువు కాదన్నది వాస్తవం. దాంతో బీజేపీ దూకుడుగా ముందుకు రావడానికి శ్రమిస్తున్న సమయంలో కాంగ్రెస్ కోలుకోవడానికి అవకాశాలు ఏమేరకన్నది వారికి అంతుబట్టడం లేదు. అయినా ఒకనాటి తమ సామ్రాజ్యం మళ్లీ తమకు చేరువవుతందనే ఆశాభావం మాత్రం వారిలో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: