ఏపీలోని ప్రతి పార్టీ అధికార వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్న విషయం తెలిసిందే. ఒక్క బీజేపీ మిగిలిన పార్టీలు జగన్ ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇందులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, ఏ స్థాయిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే టీడీపీతో పాటు జనసేన, సి‌పి‌ఐ,సి‌పి‌ఎం, కాంగ్రెస్..ఇంకా చిన్నాచితక పార్టీలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నాయి.

అయితే ఇందులో కమ్యూనిస్టుల్లో కీలకంగా ఉన్న సి‌పి‌ఐ, టీడీపీ బాటలోనే నడుస్తోంది. చంద్రబాబు ఏది అంటే సి‌పి‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ అదే అంటున్నారు. టీడీపీ చేసే ప్రతి పోరాటానికి ఆయన మద్ధతు ఇస్తున్నారు. బాబు ఏం చెబితే అదే చేస్తున్నారు. అలాగే ప్రతిరోజూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కూడా చంద్రబాబుని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తున్నట్లుగా ఉందని, మంత్రి అనిల్‌కు పోలవరం గురించి ఏమైనా తెలుసా? అని ప్రశ్నించిన ఆయన.... వైసీపీ నేతలకు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని విమర్శించారు.  

అంటే వైసీపీ నేతలు ఏం చేసిన చంద్రబాబు టార్గెట్‌గానే చేస్తున్నారనే విధంగా రామకృష్ణ విమర్శలు చేశారు. చంద్రబాబు అంటే వైసీపీ నేతలకు భయం పట్టుకుందని మాట్లాడుతున్నారు. అయితే రాష్ట్రంలో ఎవరికి ఎవరి వల్ల భయమో అందరికీ తెలిసిందే అని వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. అయినా ఒకప్పుడు పోరాటాలకు పెట్టింది పేరుగా ఉన్న సి‌పి‌ఐ పార్టీ ఇప్పుడు టీడీపీకి తోక పార్టీగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.

అసలు సి‌పి‌ఐ పార్టీ రాష్ట్రంలో దాదాపు ఉనికిని కోల్పోయినట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జనసేనతో కలిసి పొత్తులో పోటీ చేసి ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. ఎన్నికలయ్యాక జనసేన, బీజేపీతో కలిసి నడుస్తుంటే, సి‌పి‌ఐ‌, టీడీపీతో కలిసి ముందుకెళుతుంది. అలా అయిన కాస్త ఉనికి కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో సి‌పి‌ఐ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సి‌పి‌ఐ వల్ల టీడీపీకి ఎంత లాభం చేకూరుతుందో కూడా చెప్పలేని పరిస్తితి.

మరింత సమాచారం తెలుసుకోండి: