ఒకప్పుడు అగ్రదేశాలు భారతదేశాన్ని చిన్నచూపు చూస్తూ ఉండేవి  అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం భారతదేశంలో అనుసరిస్తున్న ఎంతో వ్యూహాత్మకమైన దౌత్యపరమైన విధానం కారణంగా ప్రస్తుతం అన్ని దేశాలు కూడా భారతదేశంతో స్నేహం చేసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో పాకిస్థాన్ వెంటనడిచే భారతదేశాన్ని ఒక చివరన చేర్చిన అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ప్రస్తుతం భారత్తో సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి  అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం సౌదీ అరేబియా దుబాయ్ లాంటి దేశాలు భారత్తో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు  సిద్ధమవుతున్న  నేపధ్యంలో రోజురోజుకు పాకిస్థాన్లో టెన్షన్ మొదలవుతుంది.



 సాధారణంగా అయితే ఒకప్పుడు ఇస్లామిక్ దేశాలు అయిన దుబాయ్ సౌదీ అరేబియా దేశాలు పాకిస్తాన్ వెంటనడిచి  పాకిస్తాన్కు కావలసినప్పుడల్లా ఆర్థిక సహాయం చేస్తూ పాకిస్తాన్ కు మద్దతుగా నిలబడుతూ వచ్చాయి . అయితే ఎప్పుడూ ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకునే దుబాయ్ సౌదీ అరేబియా లాంటి దేశాల పై ఆధిపత్యం సాధించేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలతో ఆ దేశాలు పూర్తిగా పాకిస్తాన్ కి  వ్యతిరేకంగా మారిపోయేది ప్రస్తుతం కనీసం పాకిస్తాన్ పేరు ఎత్తిన కూడా మండిపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇదే సమయాన్ని  క్యాష్ చేసుకుంటున్న భారత్ అరబ్ కంట్రీస్ తో ప్రస్తుతం ఎంతో దోస్తీ  చేస్తూ ముందుకు సాగుతున్నాయి.  



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అరబ్ కంట్రీస్ లో టూర్ కాస్త పాకిస్తాన్ లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ పై  వరుసగా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్న భారత్ కోలుకోలేని విధంగా పాకిస్థాన్ను దెబ్బ కొడుతుంది అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గల్ఫ్ దేశాలలో ఆరు రోజులపాటు పర్యటించడం మాత్రం ప్రస్తుతం మరింత ఆసక్తిని సంతరించుకుంది. ఈ ఆరు రోజుల పర్యటనలో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారగా పాకిస్తాన్ లో   భయం మరింత పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: