గ్రేటర్ ఎన్నికల పోరు వాడివేడిగా సాగుతున్నాయి.  ఇక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు తమదైన శాలిలో ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌.కె.పురం డివిజన్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మురుకుంట్ల విజయ భారతి అరవింద్‌ కు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుతూ గురువారం వాసవి కాలనీ లో జరిగిన సమావేశంలో ఆర్యవైశ్యుల ను మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలోపర్యాటక శాఖ అభివృద్ధి చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్‌ గుప్త, ఇండస్ట్రియల్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణ, వాసవి కాలనీ అధ్యక్షుడు చంద్ర శేఖర్‌ గుప్తా, బంధం దామోదర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్కేపురం డివిజన్లోని పలు కాలనీలలో బుధవారం ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతోఅన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన మానిఫెస్టో ప్రజలందరి మన్ననలు పొందిందని టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. గురువారం ఆర్‌కేపురం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్ధి విజయభారతి అరవింద్‌శర్మను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌కేపురం డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం పనిచేసే టీఆర్‌ఎస్‌ పార్టీకి  యువత కారు గుర్తుకు ఓటు వేసి విజయ భారతి అరవింద్‌  గెలిపించాలని కార్తిక్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌  నాయకత్వములో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఆశీస్సులతో   పోటీలో ఉన్న విజయ భారతి అరవింద్‌ శర్మను గెలిపించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: