నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దూకుడు తగ్గలేదు. వైసీపీ ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచే ఎంపీగా గెలిచి, అదే పార్టీపై రాజుగారు తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మొదట తిరుపతి భూములు, ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూముల విషయంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన రాజుగారు...అప్పటి నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ముందుకెళుతున్నారు.

నరసాపురం ఎంపీ అయినా సరే, ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నా సరే ఆ పార్టీతో విభేదించి రాజుగారు ఎందుకు విమర్శలు చేస్తున్నారనేది పెద్దగా క్లారిటీ రావడం లేదు. వైసీపీ పార్టీ పరంగా చూసుకుంటే, రాజుగారు టీడీపీ లైన్‌లో ఉన్నారనే ఆరోపణ ఉంది. కానీ మరీ గుడ్డిగా అధికార పార్టీలో ఉంటూ, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏ నేత మాట్లాడరు. ఏ నేత అయినా అధికారాన్ని అనుభవించాలనే చూస్తారు. మరి రాజు గారు ఎందుకు విభేదించారో అర్ధం కావడం లేదు.

అయితే వైసీపీతో విభేదించిన రాజుగారు, అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్‌గా మాట్లాడుతున్నారు. తాను జగన్ బొమ్మ వల్ల గెలవలేదని మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా అదే విషయం మరోసారి చెప్పి, తన వల్ల ఐదుగురు ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్పి, జగన్ పార్టీలోకి తీసుకుని టిక్కెట్ ఇచ్చారని చెబుతున్నారు. తనతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారని ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

రాజుగారు మాటలు బాగానే ఉన్నాయి. కానీ ఆయన వల్ల ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ గెలుస్తుందని చెప్పడ కాస్త ఓవర్ గానే ఉంది. అలాగే రాజుగారు, జగన్ ఇమేజ్ మీదే గెలిచారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే రాజుగారు బయటకు వెళ్లడంతో, నెక్స్ట్ నరసాపురం బరిలో గట్టి అభ్యర్ధిని పెట్టాలని జగన్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీలో ఉన్న ఓ బలమైన నేతని వైసీపీలోకి తీసుకొచ్చి, నరసాపురం టిక్కెట్ ఇచ్చి, రాజుగారికి చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో రాజుగారి రాజకీయం ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: