కర్నూలు రాజకీయాల్లోఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఓ కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి అఖిలప్రియ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. అఖిల జైలుకు వెళ్ళాక ఏవీ ఫ్యామిలీ యాక్టివ్ అవుతుంది. జిల్లాలో భూమా ఫ్యామిలీకి, ఏవీ ఫ్యామిలీకి పెద్దగా పడటం లేదనే సంగతి తెలిసిందే. అయితే గతంలో ఏవీ ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీతో సఖ్యతతోనే ఉండేది. ఏవీ సుబ్బారెడ్డి, దివంగత భూమా నాగిరెడ్డిలు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. నాగిరెడ్డి చనిపోయాక, సుబ్బారెడ్డి, అఖిలప్రియలకు పెద్దగా పొసగడం లేదు.

ఒకే పార్టీలో ఉన్నా సరే, వీరి మధ్య సఖ్యత లేదు. వీరి మధ్య సఖ్యత కుదర్చడానికి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇప్పుడు కూడా వీరు ఒకే పార్టీలో ఉన్నా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తనని మర్డర్ చేయడానికి అఖిలప్రియ ప్రయత్నిస్తుందని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే, అఖిలప్రియ ఓ భూ వివాదానికి సంబంధించిన కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నారు. ఇందులో ఏవీ పాత్ర ఉందని పోలీసులు మొదట అనుమానించి తర్వాత లేదని వదిలేశారు.

ఇక అఖిలప్రియని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు. అఖిల జైలుకు వెళ్ళాక కర్నూలులో టీడీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. ఇప్పటికే పార్లమెంట్ అధ్యక్షులు పనిచేయడం మొదలుపెట్టారు. అలాగే పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. ఇదే సమయంలో ఏవీ సుబ్బారెడ్డి తనయురాలు ఏవీ జస్వంతిరెడ్డి సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

జస్వంతి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో అధికార వైసీపీపై బాగానే ఫైర్ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పులని ఎత్తిచూపిస్తూ, టీడీపీకి సపోర్ట్‌గా ఉంటున్నారు. అలాగే అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూల్లో కూడా కనిపిస్తున్నారు. అలాగే ఫీల్డ్‌లోకి కూడా వెళుతూ, పార్టీ కోసం పనిచేస్తున్నారు. మొత్తానికైతే అఖిల జైలుకెళ్లడమే జస్వంతి యాక్టివ్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: