ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఎమ్మెల్యేలు కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు ముఖ్యమంత్రి జగన్ కు చాలా ఇబ్బందికరంగా మారింది. పోలీసులు విషయంలో కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పుడు పక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం గా ఉన్నాయి. కొంత మంది పోలీసులను టార్గెట్ గా చేసుకుని వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు పై ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పోలీసులను కనీసం గౌరవించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నెల్లూరు ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి.

ఐపీఎస్ అధికారిని ఆయన దూషించిన విధానం పై వైసీపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ ఎంత బలంగా ఉన్నా సరే... ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు పోలీసులు విషయంలో చేసిన పరిస్థితి లేదు అని చెప్పాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా పోలీసులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. అప్పుడు పోలీసులు విపక్షాల విషయంలో కూడా ఇలా వ్యవహరించిన పరిస్థితి లేదు అని చెప్పాలి. పోలీసులను వాడుకొనే విషయంలో వైసీపీ నేతలు అన్ని విధాలుగా కూడా విజయం సాధిస్తూనే ఉన్నారు.

విపక్షాలను ఇబ్బంది పెట్టడానికి పోలీసులను ప్రయోగించడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఇదే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పాలి. రాయలసీమ జిల్లాల్లో పోలీసులు విషయంలో వైసీపీ నేతల తీరుపై ఇప్పుడు ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతోంది. పోలీసులు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడని వారిని వైసీపీ కార్యకర్తల మాదిరి పోలీసులు ఇబ్బంది పెట్టడం వైసీపీ నేతలను కూడా విస్మయం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది అని చెప్పాలి. పోలీసులను గౌరవించకపోతే ఎన్నికలలో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయినా సరే పోలీసులు విషయంలో వైఖరి మార్చుకోవడం లేదు మరి భవిష్యత్ లో ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: